vegetable prices : వరదలతో కొండెక్కిన కూరగాయల ధరలు.. సామాన్యులకు చుక్కలే..

vegetable prices : వరదలతో కొండెక్కిన కూరగాయల ధరలు.. సామాన్యులకు చుక్కలే..

vegetable prices :  భారీ వర్షాలతో కూరగాయల ధరలు మరోమారు అమాంతం పెరిగాయి. ఎక్కడా కూరగాయల ధరలు అందుబాటులో లేవు. ప్రధానంగా అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయల ధరలు మరోమారు మంటపెడుతున్నాయి. వెల్లుల్లి ఏకంగా 500 రూపాయలకు కిలో అంటున్నారు. అల్లం 200కు చేరుకుంది. ఇకపోతే ఉల్లిపాయలు 60కి అమ్ముతున్నారు. వరద ప్రాంతాల్లో అసలు కూరగాయలు, నిత్యావసర వస్తువులు దొరకడం లేదని ప్రజలు వాపోతున్నారు.

రవాణా సదుపాయాలు సరిగా లేకపోవడం వల్లనే కూరగాయల ధరలు పెరుగుతున్నాయని కూరగాయల వ్యాపారులు అంటున్నారు. ఆటోలు, ట్రాలీల్లో ఎక్కువ ధరలు చెల్లించి తీసుకుని రావాల్సి వస్తోందని అన్నారు. వర్షాల కారణంగా దిగుబడులు తగ్గాయని వాపోతున్నారు. పెట్రో ధరల ప్రభావంతో రవాణా సౌకర్యాలు పూర్తిస్థాయిలో మెరుగుపడలేదు. ఇప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొనలేదు.

Read Also మేడిప‌ల్లి ల‌య‌న్స్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణం

ఇటీవ‌ల‌ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల రేట్లు పెరిగిపోవడంతో వాహనాల్లో స‌రుకుల ర‌వాణాకు సైతం అధికంగా వెచ్చించాల్సి వస్తోంది. అలాగే మార్కెట్లలో కూలీలు సైతం అందుబాటులో ఉండడంలేదు. పక్క రాష్టాల్ర నుంచి వచ్చే కూరగాయల వాహనాలకు గతంతో పోలిస్తే 3వేల నుం చి 4వేల దాకా అదనంగా ఖర్చుచేయాల్సి వస్తున్నదని అమ్మకందారులు చెబుతున్నారు. కూరగాయల ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోవడంతో అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడిరది. మార్కెట్లోకి వెళ్లి ఏది కొందామ‌న్నా వాటి రేట్లు చూడ‌గానే వినియోగ‌దారులు జంకుతున్నారు.

Read Also అర్హులైన నిరుపేదలకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చెయ్యాలి..

08 -03

Read Also ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి

వంద‌ల రూపాయ‌లు వెచ్చించాల్సి ఉండడంతో వాటి రేట్లు తెలుసుకుని భ‌య‌ప‌డిపోతున్నారు. ప‌ల్లెల్లో కంటే పట్ట‌ణాల్లో నివ‌సించే వారికి మాత్రం ఈ కూరగాయ‌ల భారం ఎక్కువ‌గానే ఉంటుంది. ఎందుకంటే వీరికి పండించే అల‌వాటు లేక‌పోవ‌డం, క‌చ్చితంగా ప్ర‌తిరోజూ రెండు నుంచి మూడు ర కాల కూర‌ల‌తో తిన‌డం అల‌వాటు ప‌డ‌డం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ఈ నేప‌|థ్యంలో కూర‌గాయల ధ‌ర‌లు ఒక్క‌సారిగా ఆకాశ‌న్నంట‌డంతో కొనుగోలు చేసేందుకు వినియోగ‌దారులు జంకుతున్నారు. దాదాపు వెయ్యి రూపాయ‌లు లేనిదే సంచి నిండ‌డం లేదు.

Read Also కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా పోరాడండి

వారానికి స‌రిప‌డా కూర‌గాయలు కావాలంటే క‌చ్చితంగా వెయ్యి రూపాల‌య‌కు పైగానే వెచ్చించాల్సిందే. అంటే నెల‌కు ఈ చొప్ప‌న దాదాపు నాలుగు వేల రూపాయ‌లు కూర‌గాయ‌ల‌కు మాత్ర‌మే వెచ్చించాల్సి వ‌స్తోంది. ఇక నెల‌లో కిరాణ సామాగ్రి ఖ‌ర్చులు లెక్కిస్తే సామాన్యుడి న‌డ్డీ విరుగుతోంద‌నడంలో ఆశ్చ‌ర్యంలేదు. అయితే వ్యాపారుల ప‌రిస్థితి కూడా దారుణంగా ఉంది. ఒక్క‌సారిగా ధ‌ర‌లు పెర‌గ‌డంతో వారిపైనా న‌ష్టాల ప్ర‌భావం స్ప‌ష్టంగా ప‌డుతోంది.

Read Also ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు  ప్రముఖులకు శ్రీ గురు పీఠం ప్రాణ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక అందజేత

దాదాపు 20 రోజుల క్రితం వరకు రోజుకు రెండు క్వింటాల్‌కు పైగానే టమాటలు అమ్మే వ్యాపారులు నేడు క్వింటాల్‌ కూడా అమ్మడం లేదని చెబుతున్నారు. వరదలు తగ్గి కొత్తగా వేసిన పంటలు చేతికందే వరకు ఇదే పరిస్థితులు ఉండవచ్చనని తెలిపారు. కూరగాయల ధరలు కొండెక్కాయి. రెట్టింపు రేట్లు పలుకు తున్నాయి. కొన్నింటి ధరలు ఏకంగా చికెన్‌ను మించి పోతున్నాయి.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఒక్కసారిగా దిగుబడి తగ్గడం, డిమాండ్‌ పెరగడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి.

08 -01

మార్కెట్లోకి వెళ్లాలంటేనే సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు భ‌యం పుట్టుకొస్తోంది. ఏ కూర‌గాయలు కొందామ‌ని అనుకున్నా కిలోకు వందకు పైనే పలుకుతున్నాయి. గ‌తంతో పోల్చితే రెండింత‌ల‌కు రేట్లు పెరిగాయి. ఏకంగా 150 నుంచి 200కు చేరాయి. వారం రోజుల్లనే రేట్లు అమాంతం పెరిగి వినియోగదారులకు చుక్కలు కనబడుతున్నాయి. ఇప్పటికే వర్షాల ధాటికి చితికిపోయిన పేదలను ఈ ధరలు మరింత భయపెడుతున్నాయి.

రాష్ట్రం, ఇతర రాష్టాల్ల్రో ఇటీవల కురిసిన భారీ వర్షాలు కూరగాయల పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. పెద్ద మొత్తంలో తోటలు దెబ్బతిన్నాయి. దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో రైతులు సైతం తీవ్రంగా నష్టాలపాలవుతున్నారు. మన రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడులో కుండపోతగా కురిసిన వర్షాలతో దిగుమతులు తగ్గిపోయాయి.

ముఖ్యంగా మన మార్కెట్‌కు టమాట, ఉల్లిగడ్డల రాక తగ్గిపోవడంతో వీటి రేట్లు ఆకాశాన్నంటు తున్నాయి. ఇటీవల కాలంలో ఇంధన ధరలు సైతం రికార్డు స్థాయికి చేరడంతో వాహన రవాణా చార్జీలు పెరిగి అంతిమంగా కూరగాయల ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?