CP Radhakrishnan: రేపు ఉద‌యం కొత్త గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణస్వీకారం

రాత్రి హైదరాబాద్ న‌గ‌రానికి రానున్నసీపీ రాధాకృష్ణన్‌  

CP Radhakrishnan: రేపు ఉద‌యం కొత్త గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణస్వీకారం

CP Radhakrishnan: హైదరాబాద్, క్విక్ టుడే :  తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేయడంతో  కొత్త గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించడం తెలిసిందే.. కాగా కొత్త గా నియమితులైన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ మంగ‌ళ‌వారం రాత్రి హైదరాబాద్ కు చేరుకుంటారు.

రాంచీలోని రాజ్ భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి రాత్రి 8.40కి స్థానిక బిర్సా ముండా ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 9.10కి రాంచీ ఎయిర్ పోర్టు నుంచి విమానంలో హైదరాబాద్ కు బ‌య‌లు దేరుతారు. రాత్రి 10.55 గంటలకు కొత్త‌ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

195 -1

అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా  రాత్రి 11.35 గంటలకు రాజ్ భవన్ కు చేరుకోనున్నారు. బుధవారం (మార్చి 20న) ఉదయం 11:15 నిలకు తెలంగాణ అద‌న‌పు గవర్నర్‌గా సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నందున‌ సోమవారం తన పదవికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే..

ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. అనంతరం  కొత్త గవర్నర్‌గా ఝార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణకు అదనపు బాధ్యతలు అప్ప‌గించ‌డం జ‌రిగింది. తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్ ను నియమించేంత‌ వరకు సీపీ రాధాకృష్ణన్‌  తెలంగాణ గవర్నర్‌గా కొనసాగనున్నారు.  

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?