Metro Rail : మెట్రో ప్ర‌యాణికుల‌కు ఉగాది పండుగ గుడ్ న్యూస్‌... 

Metro Rail : మెట్రో ప్ర‌యాణికుల‌కు ఉగాది పండుగ గుడ్ న్యూస్‌... 

Metro Rail : ఉగాది పండుగ పుర‌స్క‌రించుకొని మెట్రో ప్ర‌యాణికుల‌కు హైద‌రాబాద్ మెట్రో సంస్థ‌ శుభ‌వార్త అందించింది. సూపర్ సేవర్ హాలిడే కార్డ్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్లు, మెట్రో స్టూడెంట్ పాస్ ల‌కు గ‌డువును పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌యాణికులు ఈ అవ‌కాశాన్ని మరో 6 నెలలపాటు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరింది.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న‌ సూపర్ సేవర్ హాలిడే మెట్రో కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ పీక్ అవర్ ఆఫర్లు మార్చి 31, 2024తో ముగియ‌గా మ‌రో 6 నెల‌ల పాటు దీనిని పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

800 -2

అయితే సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు ద్వారా ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో  కేవ‌లం రూ.59కే రోజంతా ప్ర‌యాణించే అవ‌కాశం ఉంటుంది. మెట్రోలో నగరంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ప్రయాణం చేసేందుకు ఎటువంటి ప‌రిమితులు లేవ‌ని తెలిపారు.

 సూపర్ ఆఫ్‌ పీక్ అవర్ ఆఫర్ స్కీమ్‌ ఉదయం 6 నుంచి 8 గంట‌ల మ‌ధ్య‌, రాత్రి 8 నుంచి చివరి మెట్రో వరకు ఈ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ ప్ర‌కారం సాధారణ కార్డు ద్వారా టికెట్ తీసుకుంటే 10 శాతం రాయితీ ఉంటుంది. వీటితోపాటు మెట్రో స్టూడెంట్ పాస్ ల‌పై కూడా మెట్రో రాయితీని య‌థావిధిగా అందుబాటులో ఉంచింది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?