Misterious Village: చాలా రోజులుగా అందరూ నిద్రిస్తున్న ఓ గ్రామ రహస్యం... వింత నిద్రపోతున్న గ్రామ వాసులు...
అన్న విషయం మనకు తెలిసిందే. అయితే అలాంటి నిద్ర ఇప్పుడు ఒక గ్రామంలో అక్కడి జనాలు కుంభకర్ణులారా నిద్రపోతున్నారట. అది ఎలా సాధ్యం మరి. కానీ ఒక గ్రామంలో జనాలు నెలలు తరబడి నిద్రపోతున్నారట. ఒక్కసారి నిద్రలోకి జారుకుంటే మళ్లీ వాళ్లు తిరిగి లేవడానికి నెలలుగా గడుస్తోంది. వినడానికి విచిత్రంగా అనిపిస్తున్న ఇది వాస్తవం. ఇది ఎక్కడో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇలా ఎక్కడపడితే అక్కడ నిద్ర ముంచుకొస్తే ఇక అంతే సంగతులట. ఏకంగా అదే ప్రదేశంలో నెలలు తరబడి నిద్రపోతారట. ఆ గ్రామ ప్రజలు. ఈ కజకిస్థాన్ లో కలాచి అనే ఊరులో సుమారు 600 మంది ప్రజలు ఉంటున్నారు. దీనిలో 14 శాతం మంది ఇటువంటి సమస్యతో ఇబ్బంది పడటం విచిత్రమే.. 2010 పాఠశాలలో జరిగిన ఘటన వలన ఈ విషయం బయటికి వచ్చింది.
కొందరు విద్యార్థులు తరగతి గదిలోనే నిద్రపోయి ఎంతసేపటికి నిద్ర లేవలేదట. ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఎంత ప్రయత్నించిన ప్రయోజనం లేకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇలా వ్యాధితో సుమారు 14% మంది ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది..
ఇక ఈ వ్యాధి గురించి తెలుసుకోవడానికి కొందరు శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేసిన ఖచ్చితమైన కారణాలు తెలియడం లేదట. అయితే ఇది ఏదో వ్యాధి వల్లే ఇలా అవుతుందని వారు అనుమాన పడుతున్నారు. అయితే ఆ వ్యాధి ఏమిటి అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోయారు. దాంతో ఈ విషయం ఓ అంతుచిక్కని మిస్టరీల ఉండిపోయింది.
మొత్తం మీద కజకిస్తాన్ లో కలాచి అనే ఊరిలో ఓ వింత నిద్ర వలన ప్రజలు ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు తెలుస్తోంది. అక్కడివారు బయటికి వెళ్లాలంటే భయపడిపోతున్నారు. పిల్లల్ని స్కూల్ కి పంపించాలన్న భయపడుతున్నారు. ఎక్కడ ఎలా ఈ నిద్ర ముంచుకొస్తుందో అని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడికి వెళ్లిన వారు అక్కడే అదే ప్రదేశంలో నెలలు తరబడి నిద్రపోవడం జరుగుతుంది.
వారు వాహనాలపై వెళ్తున్న కూడా వాహనాల పక్కన పడేసి అక్కడే నిద్రిస్తున్నారట. ఇలా జరగడం అనేది విచిత్రమే కదా.. కొన్నిచోట్ల విచిత్రమైన జబ్బులు జనాలని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.కానీ దీనికి కారణాలు ఏంటి అన్న విషయం ఇంతవరకు అంతు పట్టడం లేదని శాస్త్రవేత్తలు కొందరు నిపుణులు తెలుపుతున్నారు.. ఇంకా ఈ వ్యాధిపై కొన్ని పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.