దేశంలోనే ఆకర్షణీయమైన టూరిజం ప్లేస్ ఈ ' మురికివాడ '.. తాజ్ మహల్ కన్నా ఫేమస్.. 

దేశంలోనే ఆకర్షణీయమైన టూరిజం ప్లేస్ ఈ ' మురికివాడ '.. తాజ్ మహల్ కన్నా ఫేమస్.. 

ముంబైలోని ధారావి మురికివాడను సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి అనేకమంది వస్తున్నారు. దీనిని స్లమ్ టూరిజం అంటున్నారు. వ్యవస్థీకృత పర్యటక ప్రాంతంగా మారిన ధారావి మురికివాడ ఇటీవల ఇండియాలోనూ అత్యంత ఆకర్షణీయమైన పర్యటక ప్రదేశంగా పేరొందింది. తాజ్ మహల్ సందర్శించే వారి కంటే ఈ మురికివాడను చూసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఈ మురికి వాడను సందర్శించేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా నుంచి ఎక్కువమంది వస్తుంటారు. అసలు ఈ మురికి వాడను చూసేందుకు ఎందుకు వస్తారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ ప్రాంతంలో చూడాల్సినవి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, తర్వాత అర్థమవుతుందని ఆ మురికివాడను సందర్శించిన వారిలో ఒకరైన కృష్ణ పూజారి వివరించారు. ఈ ధారావి మురికివాడ ముంబై మహానగరం నడిబొడ్డున ఉంది. అగ్గిపెట్టె లాంటి ఇళ్లు, ఇరుకైన వీధులు, వర్క్ షాపులు, మురికి కాలువలతో నిండి ఉంటుంది. దాదాపుగా ఇక్కడ పది లక్షల మంది నివసిస్తున్నారు. పబ్లిక్ టాయిలెట్లు నీటి కుళాయిలు ఉన్నాయి. కానీ పరిశుభ్రత సరిగా ఉండదు. మురికి నీరంతా వీధుల్లో పారుతూ ఉంటుంది. 

చాలామంది ఎంబ్రాయిడరీ వస్త్రాలు ఎగుమతికి అనువైన నాణ్యమైన తోలు ఉత్పత్తులు, ప్లాస్టిక్ వస్తువులు, కుండలను తయారు చేస్తుంటారు. ఇక్కడ జరిగే వ్యాపారం వార్షిక టర్నోవర్ 4600 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. చెత్త ఏరుకునే వారు, పారిశుద్ధ కార్మికులు, టాక్సీ డ్రైవర్లు కూడా ఉంటారు. ఈరోజు పూట గడిస్తే చాలు అన్నట్లుగా రోజు కూలి పని చేసుకుంటూ బ్రతికే వారు కూడా ఎంతోమంది ఉంటారు. విక్టోరియా మహారాణికాలం నుంచి ఇక్కడికి సందర్శకులు వస్తున్నారు. మొదట్లో వినోదం కోసం వచ్చేవారు. మామూలు పర్యాటక ప్రాంతాల్లో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా టూరిజం ప్యాకేజీలను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. ఏసీ, నాన్ ఏసీ సదుపాయాలు ఉంటాయి.  ఇన్ సైడ్ ముంబై లాంటి పర్యాటక సంస్థలు ఈ మురికివాడలోని ఇళ్లలో భోజనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తాయి. 

మురికివాడలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై ఎవరు పెద్దగా మాట్లాడటం లేదు. పేదరికం గురించి పట్టించుకోవట్లేదు. అక్కడ పరిస్థితులు సాధారణమే అన్నట్లుగా చూస్తున్నారు. అక్కడి ప్రజలతో మాట్లాడేందుకు కూడా అనుమతించట్లేదు. చాలామంది సందర్శకులు ఆ మురికివాడలో పేదరికం గురించి ఆందోళనతో పర్యటన ప్రారంభించినట్లు తెలుస్తోంది. కానీ తర్వాత పర్యటన ముగిసేటప్పటికీ అక్కడి ప్రజలకు ఏ సమస్య లేదన్నట్లుగా అనిపించింది అని చాలామంది రివ్యూలు రాశారు. ఆ మురికి వాడను విడిచి వెళ్లేటప్పుడు సందర్శకులు అలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు ఏదో పొరపాటు చేస్తున్నారని అనిపిస్తుందని అంటున్నారు. తమ పర్యటన చాలా అద్భుతంగా సాగింది అంటూ మురికి వాడను ఒక ఆర్థిక కేంద్రంగా వర్ణిస్తూ రివ్యూలు రాశారు. కానీ వారంతా ఒక వాస్తవాన్ని విస్మరించారు. వాళ్లకు సరైన రవాణా సదుపాయాలు లేవు. విద్యుత్ సరిగా లేదు పరిశుభ్రమైన త్రాగునీరు లేదు. ఇలా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి వాటిని ఎవరు గుర్తించడం లేదు. భారత్ అంతరిక్షంలోకి రాకెట్లను పంపిస్తుంది అయినప్పటికి అనేకమంది ప్రజలు మౌలిక నివాసం, పారిశుద్ధం వంటి సౌకర్యాలను పొందలేకపోతున్నారు.

 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?