Back to FeedQuickToday Shorts

National
Aug 24, 2026Short Read
బ్యాంకింగ్ సేవలకు బ్రేక్: 3 దశల్లో దేశవ్యాప్త సమ్మెకు ఉద్యోగుల పిలుపు!
తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమైంది. ఈ నిరసనలను 3 దశల్లో చేపట్టనున్నట్లు ప్రకటించింది.
సమ్మె షెడ్యూల్:- సెప్టెంబర్ 11: 1 రోజు సమ్మె
సెప్టెంబర్ 28 - 30: 3 రోజుల సమ్మె
అక్టోబర్ 26 నుంచి: నిరవధిక సమ్మె
వారానికి 5 రోజుల పనిదినాలు కల్పించాలని, సవరించిన పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్‌ను ఉపసంహరించుకోవాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.





