Back to FeedQuickToday Shorts

National
Aug 24, 2026Short Read
ఉల్లి ధరలకు చెక్: రంగంలోకి కేంద్రం 'కందా ఎక్స్‌ప్రెస్'
దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు మళ్లీ మండిపోతున్నాయి.
ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో కిలో ఉల్లి ధర రూ.
50 నుంచి 70 వరకు పలుకుతోంది.
ఈ పెరుగుతున్న ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.తన వద్ద ఉన్న బఫర్ స్టాక్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది.
ధరలు ఎక్కువగా ఉన్న ఢిల్లీ, చెన్నై, కొచ్చి, గువాహటి తదితర ప్రాంతాలకు నాసిక్ నుంచి నేటి నుంచే 'కందా ఎక్స్‌ప్రెస్' రైళ్ల ద్వారా ఉల్లిగడ్డలను రవాణా చేయనున్నారు.
అక్కడ తక్కువ ధరకే ప్రజలకు ఉల్లిని అందించనున్నారు.
ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం కందా ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపడం ఇది మొదటిసారి కాదు; 2024 అక్టోబర్‌లోనూ ఇలాంటి చర్యలే తీసుకుంది.





