Dandampally Sattaiah: వేధింపులకు గురి చేస్తున్న హాస్పిటల్ కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలి

Dandampally Sattaiah: వేధింపులకు గురి చేస్తున్న హాస్పిటల్ కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలి


Dandampally Sattaiah: నల్లగొండ.మార్చి 1 (క్విక్ టుడే) : కార్మికుల పట్ల పక్షపాత వైఖరితో హాస్పిటల్ కాంట్రాక్ట్ కార్మికుల ఆత్మహత్యా యత్నానికి కారణమైన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని హాస్పిటల్ లో విధుల‌ నుండి తొలగించారనే మ‌న‌స్తాపంతో ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కార్మికులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ గత సంవత్సరం జీవో 60 ప్రకారం పిఎఫ్ ఈఎస్ఐతో కలిపి రూ.15,600 ఇవ్వాల్సి ఉండ‌గా రూ.11వేల వేతనం, పిఎఫ్ ఈఎస్ఐ చెల్లిస్తున్నారని అన్నారు. కార్మికుల డ్యూటీల పట్ల పక్షపాత వైఖరి అవలంబిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. హాస్పిటల్ కాంట్రాక్టర్ సాయి సెక్యూరిటీ ఏజెన్సీ పై చర్య తీసుకొని ,కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వమే వేతనాలు నేరుగా చెల్లించాలని డిమాండ్ చేశారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?