Tera Chinnapareddy: బీఆర్ఎస్‌కు మ‌రో బిగ్‌షాక్‌.. మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి రాజీనామా

Tera Chinnapareddy: బీఆర్ఎస్‌కు మ‌రో బిగ్‌షాక్‌.. మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి రాజీనామా

Tera Chinnapareddy: బీఆర్ ఎస్ పార్టీని ఇప్ప‌టికే ప‌లువురు ముఖ్య నేత‌లు వీడుతున్న క్ర‌మంలో మ‌రో బిగ్‌షాక్ త‌గిలింది. మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.. బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆయ‌న‌ తన రాజీనామా పత్రాన్ని పంపించారు. నల్లగొండ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించిన రోజే మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి తన రాజీనామా పత్రాన్ని పంపించడం గుర్తుంచుకోవలసిన విషయం.

నల్లగొండ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను ప్రకటించాలని మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి బి ఆర్ఎస్
అధిష్టానాన్ని కోరారు. బీఆర్ఎస్ అధిష్టానం సైతం చిన్నపరెడ్డిని నలగొండ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడానికి సమంజసం అని భావించింది. కానీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి బిజెపిలోకి వెళ్తున్నట్టు ప్రచారం జరగడంతో చిన్నపరెడ్డి పేరును పక్కన పెట్టింది.

తేరా చిన్నపరెడ్డి తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని ప్రకటించ‌నిప్ప‌టికీ అధిష్టానం పట్టించుకోలేదు. నల్ల‌గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తన అన్న కంచర్ల కృష్ణారెడ్డికి టికెట్ కావాలని పట్టుబట్టడంతో, మాజీ మంత్రి గుంట‌కండ్ల జగదీశ్వర్ రెడ్డి అండదండలు ఉండడంతో బీఆర్ఎస్ అధిష్టానం దిగివచ్చి కంచర్ల కృష్ణారెడ్డి పేరును ప్రకటించింది.

24 -1

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేంద‌ర్‌ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి మొదట్లో నల్లగొండ టికెట్ తనకు కావాలని అధిష్టానాన్ని కోరారు. నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే లు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యతిరేకించడంతో బీఆర్ఎస్ పార్లమెంట్ టికెట్ తనకు రాదని భావించి కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి చర్చలు సైతం కొనసాగించారు.

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నల్ల‌గొండ పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించడంతో భువ‌న‌గిరి టికెట్ ఇచ్చిన తాను పార్టీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 15 రోజుల క్రితమే హుజూర్‌న‌గర్ మాజీ ఎమ్మెల్యే  శానంపూడి సైదిరెడ్డిని నలగొండ పార్లమెంట్ బిజెపి అభ్యర్థిగా ప్రకటించింది. అయినప్పటికీ మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి బిజెపి పార్టీలోకి వస్తారని చర్చ జరగడం ఎంపీ టికెట్ సైతం ఇస్తారని చర్చ కొనసాగింది.

బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి ప్రకటించడంతో నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నాయకులు రాజీనామా చేయాలని ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.  చిన్నపరెడ్డి బిజెపి పార్టీలోకి వెళ్తున్నాడని చర్చ కొనసాగుతుంది. అయితే ఆ పార్టీలోకి వెళ్లినా టికెట్ వచ్చే పరిస్థితులు లేవు. త‌న వ్యాపారాల‌ను కొన‌సాగించ‌డానికి బీజేపీలోకి వెళ్ల‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని ఆయ‌న భావించిన‌ట్లు తెలుస్తోంది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?