CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం


CM Revanth:  అదానీ-అంబానీలే కాదు, తెలంగాణ ఆడబిడ్డలు సైతం పవర్ ప్రాజెక్టులు నిర్వహించగల సమర్థులు అని చాటి చెప్పేలా మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళలతో పాటు రైతులు, యువతకు కూడా ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక కేడీఆర్ పాలిటెక్నిక్ కాలేజీ మైదానంలో మహిళలు వేలాదిగా పాల్గొన్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.  "వనపర్తిలో నేను నేర్చుకున్న రాజకీయ చైతన్యం తోనే తెలంగాణ ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డాను. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతోంది.

రాష్ట్రంలో 25 లక్షల 50 వేల మంది రైతులకు రూ.22 వేల కోట్ల  రుణమాఫీ జరిగింది.  రైతు భరోసా నిధులను కూడా ఖాతాల్లో వేశాం.  రాష్ట్రంలో  విద్యుత్ వినియోగం 16 వేల మెగావాట్ల కు పైగా పెరిగినా ఎక్కడా  విద్యుత్ కోతలు లేకుండా చూస్తున్నాం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 50 లక్షల కుటుంబాలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఇప్పటివరకు 150 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారు. దాని కోసం రూ.4500 కోట్లు చెల్లించాం.

Read Also గంగమ్మ తల్లి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే

0301

Read Also జ్యోతిబాపూలే బీసీ గురుకుల డిగ్రీ కళాశాల ప్రవేశాలకు నోటిఫికేషన్

స్వయం సహాయక సంఘాలను గత  ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలు ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళా సంఘాలకు పునరుజ్జీవం కల్పించాం. రాష్ట్రంలో 65 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వనపర్తి సాక్షి గా ఈ రోజు రూ.1000 కోట్ల రుణాలను ఆడబిడ్డలకు ఇచ్చాం.  అదానీ, అంబానీ లే కాదు తెలంగాణ స్వయం సహాయక మహిళలు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నాం. 1000 బస్సులను స్వయం సహాయక మహిళలతో కొనుగోలు చేయించి  ఆర్టీసీ కి అద్దెకు ఇచ్చేలా చేశాం.

Read Also ప్ర‌భుత్వం ఇచ్చిన ప‌ట్టాల‌ను.. లాక్కున్న ల్యాండ్ మాఫియా పేద‌ల‌కు న్యాయం జ‌రిగేవ‌ర‌కు పోరాడుతాను

ప్రభుత్వ పాఠశాల‌ల్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు బట్టలు కుట్టే పనిని స్వయం సహాయక మహిళలకు కల్పించాం. ప్రభుత్వ పాఠశాలను నిర్వహించే బాధ్యతను కూడా ఇచ్చాం. రాష్ట్రంలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల ను మహిళల పేరుతో ఇస్తున్నాం. దేశ చరిత్రలో ఇదొక రికార్డు. 22 వేల టీచర్లకు ప్రమోషన్లు, 35 వేల టీచర్లకు బదిలీలు చేసి వారి సమస్యలు పరిష్కరించాం. మెట్రో రైలు విస్తరణ నుంచి మూసీ పునరుజ్జీవం దాకా తలపెట్టిన అన్ని పనులను పూర్తి చేసి తీరుతాం. " అని ముఖ్యమంత్రి  చెప్పారు.

Read Also ఐ.ఎన్.టి.యుసి ట్రేడ్ యూనియన్ జెండా ఆవిష్కరణ

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?