Gali Janardhan Reddy : బీజేపీ గూటికి గాలి జనార్ధన్ రెడ్డి
On
రాజకీయాలపై ఉన్న ఆసక్తితో గతేడాది అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన కల్యాణరాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు బీజేపీతోనే ఉన్న ఆయన ఇలా ప్రత్యేక పార్టీని పెట్టారు. మళ్లీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయన పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.
లోక్‌సభ ఎన్నికల్లో బయట నుంచి మద్దతునిచ్చే బదులు పూర్తిగా బీజేపీలో చేరిపోవాలని అమిత్ షా సూచించినట్లు తెలిపారు. ఆలోచించి నిర్ణయం తీసుకోమని సలహా ఇచ్చినందున తిరిగి బీజేపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నా రాజకీయ ప్రస్థానం బీజేపీతోనే మొదలైందని,, అందుకే మళ్లీ సొంత గూటిలో చేరుతున్నట్లు తెలిపారు. నేనింకేదో ఆశించి మాత్రం పార్టీలో చేరడం లేదని, నిజాయతీగా పని చేసేందుకే పార్టీలోకి వచ్చినట్లు తెలిపారు.
Tags:
Related Posts
Latest News
23 Apr 2025 13:59:30
పెబ్బేర్, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్): -ఇంటర్మీడియట్ ఫలితాలలో మోడల్ కళాశాల పెబ్బేర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే ప్రథమ స్థానాన్ని సాధించి సత్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...