ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్
On
ఇంటర్మీడియట్ ఫలితాలలో మోడల్ కళాశాల పెబ్బేర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే ప్రథమ స్థానాన్ని సాధించి సత్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం బెైపీసీలో కళ్యాణి 988/1000 ఎంపీసీలో శ్రీజశ్రీ 982/1000 ఎంఈసీలో కవిత 943/1000 సీఈసీలో అబ్దుల్ రహమాన్ 809/1000 సాధించి కళాశాలకు మంచి గుర్తింపు తెచ్చారు. అదేవిధంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో అనూష 463
బెైపీసీలో జ్యోతి 434, సీఈసీలో రేవతి 428, ఎంఈసీలో అఖిల 465 మార్కులు సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో కళాశాల పెబ్బేర్ మొత్తంగా ఎంపీసీలో 94శాతం, బెైపిసి 89శాతం, సిఇసిలో 61శాతం, ఎంఈసీలో 100 ఉత్తీర్ణత సాధించగా.. ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలో ఎంపీసీలో 91శాతం, బైపీసీలో 89శాతం, సీఈసీలో 51శాతం, ఎంఈసీలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉమ్మడి జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించి అత్యుత్తమ మార్కులు సంపాదించిన మోడల్ కళాశాల విద్యార్థులను అధ్యాపకులను ప్రిన్సిపాల్ డా.తూర్పింటి.నరేశ్ కుమార్, వనపర్తి డీఐఈవో ఎర్ర అంజయ్య, మోడల్ కళాశాల డిప్యూటీ డెైరెక్టర్ దుర్గాప్రసాద్, అడిషనల్ డెైరెక్టర్ శ్రీనివాసాచారి అభినందించారు.
Tags:
Latest News
23 Apr 2025 13:59:30
పెబ్బేర్, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్): -ఇంటర్మీడియట్ ఫలితాలలో మోడల్ కళాశాల పెబ్బేర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే ప్రథమ స్థానాన్ని సాధించి సత్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...