Madhavi Latha vs Asaduddin Owaisi : పాత‌బ‌స్తీలో గెలిచేది ఎవ‌రు..?  మాధ‌వీల‌త వ‌ర్సెస్ అస‌దుద్దీన్ ఒవైసీ

Madhavi Latha vs Asaduddin Owaisi : పాత‌బ‌స్తీలో గెలిచేది ఎవ‌రు..?  మాధ‌వీల‌త వ‌ర్సెస్ అస‌దుద్దీన్ ఒవైసీ

Madhavi Latha vs Asaduddin Owaisi : తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ  ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరి ముఖ్యంగా హైదరాబాద్ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఎవరికి అంతుచిక్కని విధంగా కనిపిస్తున్నాయి.

ఇక ఈ నియోజకవర్గం నుండి ముస్లిం పార్టీకి చెందిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఒకవైపు నుండి పోటీ చేస్తుండగా ఆయనకు దీటుగా భాష్యంలోనూ రూపంలోను హిందుత్వాన్ని కనబరుస్తున్నటువంటి కొంపెల్ల మాధవి లత బీజేపీ పార్టీ తరఫున బరిలో దిగుతున్నారు.

అయితే కొంపెల్లి మాధవి లతను బీజేపీ పార్టీ అనూహ్యంగా ఎంపిక చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఈమె బీజేపీ తరుపున ప్రచారాలు చేస్తూ ఎక్కడ కనిపించలేదు. అసలు ఆమెకు బీజేపీ పార్టీ సభ్యత్వం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. కానీ బీజేపీ అధిష్టానం ఆమెని ఎంపీగా ప్రకటించడం గమనార్హం..

075 -1

వాస్తవానికి పాతబస్తీలో అసదుద్దీన్ ఓవైసీ ఎదురులేని శక్తిగా ఎదిగారు. 1984 నుండి 2004 మధ్య కాలంలో ఎంఐఎం అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఆరుసార్లు ఎంపీగా గెలిచి త‌న స‌త్తా చాటుకున్నారు. అనంతరం 2004 నుండి అసదుద్దీన్ ఓవైసీ వరుసగా విజయ పరంపర కొనసాగిస్తున్నారు.

ఇలాంటి తరుణంలో అసదుద్దీన్ ఓవైసీని పాతబస్తులో ఓడించడం అనేది  తేలికైన విషయమైతే కాదు. కానీ ప్రస్తుతం బీజేపీ అధిష్టానం పాతబస్తీ నుండి మాధవి లతకు సీట్ ను ప్రకటించింది. ఇక మాధవి లత పాతబస్తీలోనే పుట్టి పెరిగిన మహిళ. అంతేకాక పాత బస్తీలో అనేక రకాల సేవాకార్యక్రమాలను చేస్తూ మంచి పేరు పొందింది.

సోషల్ మీడియా వేదికగా కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో అసదుద్దీన్ ఓవైసీకి కూడా ఓటమి భయం పట్టుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే గత ఎన్నికల్లో పోల్చి చూసినట్లయితే ఈసారి ఎన్నికల్లో అసదుద్దీన్ ప్రచారాలను ముమ్మరం చేశారు. వాస్తవానికి పాత బస్తీలో అసదుద్దీన్ ప్రచారాలు చేయకపోయినా సరే గెలుస్తారనే నమ్మకం ఉండేది.

075 -2

కానీ బీజేపీ అధిష్టానం పాతబస్తీ నుండి మాధవి లతను బరిలో దించిన తర్వాత అసదుద్దీన్ కి కూడా కాస్త ఓటమి భయం పట్టుకుందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నడూ లేని విధంగా అసదుద్దీన్ ఎంఐఎం ఓవైసీ ప్రచారాలు ముమ్మరం చేశారు. పాతబస్తీలో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలనుచేస్తూ ప్రజలలో మంచి ఆదరణ పొందిన మాధవి లతకు ముస్లిం మహిళల ఓట్లు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి పాతబస్తీలో ఇప్పటివరకు మహిళా అభ్యర్థులు పోటీ చేసిన దాఖలాలు లేవు. దీంతో ఎంతోమంది మహిళలు ఇంట్లోనే చస్తూ బతుకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ముస్లిం మహిళలకు మహిళ అభ్యర్థి యొక్క అవసరం చాలా ఉంటుంది.

దీంతో చాలామంది మహిళలు నేడు మాధవి లతకు అండగా నిలబడే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే విషయాన్ని ఇటీవల మాధవి లత కూడా ఇంటర్వ్యూలో తెలియజేశారు. తరతరాలుగా ఇంట్లోనే చస్తూ బ్రతుకుతున్న ముస్లిం మహిళలకు చావా ఓటా అనే పరిస్థితి కనిపిస్తే , కచ్చితంగా వారు ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆమె తెలిపారు.

075 -3

పాతబస్తీలో మాధవి లత విజయం సాధించినట్లయితే కచ్చితంగా ముస్లిం మహిళలు మార్పు కోరుకున్నట్లే అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పాతబస్తీలో ఎన్నో ఏళ్లుగా పురుష అధికారంతోనే రాజకీయాలు నడుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ముస్లిం మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే మాధవి లత హిందుత్వవాది అయినప్పటికీ తమకు అండగా నిలబడుతుందనే ఆలోచనతో ముస్లిం మహిళలు ఆమెకు అండగా నిలబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే పాతబస్తీలో ముస్లిం మహిళలు కచ్చితంగా మార్పు కోరుకున్నట్లే.

అలాగే ముస్లిం మహిళల కోసం మోడీ ప్రభుత్వం త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి ముస్లిం మహిళలు ఇలాంటి రోజు కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశారు. ఈ చట్టం వలన ముస్లిం మహిళలు ఎన్నో రకాలుగా సమస్యలను ఎదుర్కొన్నారు.

075 -4

త్రిపుల్ తలాక్ చట్టం అక్రమం అని దీనిపై చాలామంది ముస్లిం మహిళలు సంతకాల యుద్ధం కూడా చేశారు. ఇలాంటి తరుణంలో మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం కాస్త బీజేపీ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. పాతబస్తీలో అసదుద్దీన్ ఓవైసీను ఓడించడం అనేది అంత తేలికైన విషయం కాదు.

ఎందుకంటే 1984 నుండి 2004 వరకు ఎంఐఎం అధినేత సుల్తాన్ సలావుద్దీన్ 6 సార్లు పాతబస్తీలో ఘనవిజయం సాధించగా 2004 నుండి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అసదుద్దీన్ ఓడిపోయినట్లుగా చరిత్రలో లేదు. ఇలాంటి తరుణంలో ఈసారి బీజేపీ పార్టీ తరఫున మాధవి లత ముస్లిం మహిళల సపోర్ట్ తో గెలిచినట్లయితే చరిత్ర తిరగరాసినట్లే అవుతుంది.

అంతకాక గత 40 ఏళ్లుగా పార్లమెంటు ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ గెలుస్తూ వస్తోంది.. అంతకుముందు ఒకే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుపు సాధించింది. ఇలాంటి తరుణంలో ఈసారిమాధవి లత గెలిచినట్లయితే ఈ రెండు పార్టీల తర్వాత ఇక్కడ జెండా పాతిన మొదటి మహిళ గా మాధవి లత హిస్టరీ క్రియేట్ చేస్తారు.

 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?