Parliament Elections Results : ప్ర‌జా తీర్పు ఎటు..?.. ఎవరి అంచ‌నాలు వారివే.. 

Parliament Elections Results : ప్ర‌జా తీర్పు ఎటు..?.. ఎవరి అంచ‌నాలు వారివే.. 

Parliament Elections Results : పార్లమెంటు ఎన్నికలు ముగిసాయి..ఇక ఎవరి అంచనాలు వారివి. అయితే ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందన్నది సర్వత్రా చర్చ జరుగుతోంది. కాగా ప్రధాన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో అనుసరించాల్సిన పద్ధతులు అనుసరించాయి. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయా పార్టీలు వ్యూహాత్మక అడుగులు వేశయనే తెలుస్తోంది.

ఎట్టి పరిస్థితుల్లో గెలుపు మనదే కావాలి అంటే మనదే కావాలని ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికలను ఆయా పార్టీలు సవాల్ గా తీసుకున్నాయి. పార్టీల అగ్ర నేతలు ప్రధాన మంత్రి కావాలని, ఢిల్లీ గద్దె నెక్కాలని ఆశిస్తున్నాయి. 

ఎన్ని స్థానాలు....?

ఇదిలావుంటే పార్లమెంట్ ఎన్నికల నేపద్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లోని 17 స్థానాలకు గాను కనీసం 10 స్థానాలైన రావాలని ఆ పార్టీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అందుకు భిన్నంగా పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా ఎన్నికల ప్రచారం ఎక్కువగా నిర్వహించక పోవడంతో పాటు పార్టీల అభ్యర్థులు ఎక్కడ కూడా ప్రచారంలో పాల్గొన్న దాఖలాలు లేవు.

బీజేపీ ధీమా

ఎంపీ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని భారతీయ జనతా పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తోంది. సాధారణ ప్రజలకు దూరంగా ఉండే బీజేపీ నాయకులు ఏం చెప్పి ప్రజల్ని ఓట్లు అడుగుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్ల అధికారంలో ఆ పార్టీ ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ప్రజలకు ఇట్టే గుర్తుండిపొది అయోధ్య రామ జన్మభూమి.

24 -2

అయితే అసాధ్యాన్ని సాధ్యం చేసిన బీజేపీ ఇదే అంశంపై ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇదే అంశంను ప్రజలు పెద్దగా తీసుకుంటారా లేదా అన్నది సర్వత్రా చర్చ జరుగుతోంది. నిజంగా అయోధ్య విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తే మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బీఆర్ఎస్ గల్లంతేనా

అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గల్లంతయ్యే పరిస్థితి నెలకొంది. పదేళ్ళ పాటు ఒక ఊపు ఊపిన బీఆర్ఎస్ ఇప్పుడు అనేక సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఆ పార్టీని ఎలా స్వీకరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు జనంలో అంతగా పట్టున్నోళ్లు కారని ఈ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకేనని పలువురు అంటున్నారు.

పార్టీ అధిష్టానం మాత్రం అభ్యర్థుల గెలుపును సవాల్ గా తీసుకుంటోందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తంగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు దేశ దిశను మార్చనున్నాయి .. ఏం జరగనుందో.చూద్దాం .. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?