Vijayanagaram District Politics: కోటీశ్వరుల అడ్డ.. విజయనగరం గ‌డ్డ

Vijayanagaram District Politics: కోటీశ్వరుల అడ్డ.. విజయనగరం గ‌డ్డ

Vijayanagaram District Politics: విజయనగరం జిల్లా పేరు చెబితేనే అంద‌రికీ గుర్తుకు వ‌చ్చేది రాజులు, రాజ్యాలు.  ఒకవైపు గజపతిరాజులు మరోవైపు బొబ్బిలి రాజుల ఏలుబడిలో ఈ ప్రాంతం లక్షలాది ఎకరాల‌ మాన్యం, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు కళ్లముందే కదలాడతాయి.

ఆనాటి రాజ వంశీకులే నేటి రాజకీయ పార్టీ అభ్యర్థులుగా రంగంలోకి దిగితే వారి ఆస్తులకు విలువ కట్టగలమా..? వారే గాకుండా దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న ఇక్క‌డి నేతల ఆస్తుల విలువ ఎంత ఉందో ఒకసారి చూద్దాం..  విజయనగరం జిల్లాలో గజపతిరాజుల ఆస్తులు లెక్కించాలంటే ఎకరాల్లో సాధ్యం కాని ప‌ని.. ఎందుకంటే లక్షలాది ఎకరాలు జిల్లాలో ఒకప్పుడు వారి ఏలుబడిలోనే ఉండేది.

కళాశాలలు, ఆస్పత్రులు, బడులు, గుడులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ఇలా అన్ని ప్ర‌జా ప్ర‌యోజ‌నాల కోసం ఇచ్చిన భూరివిరాళం వారి భూములే. ఇంత‌టి గజపతిరాజుల రాజ‌వంశీకుల వార‌సురాలు టీడీపీ తరపున బరిలో దిగుతున్న అదితి విజయలక్ష్మీ గజపతిరాజు ఆస్తుల విలువ ప్రస్తుతానికి రూ.19 కోట్లు ఉండగా, అప్పులు ఏమీలేవు. ఆమె పేరిట ప‌లు బ్యాంకుల్లో రూ.10 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. దాదాపు రూ.1.1 కోట్ల విలువైన వజ్రాభరణాలు ఉన్నాయి.

230 -2

మొత్తంగా చరాస్తుల విలువ రూ. 11.35 కోట్లు, భూములు, ప్లాట్లు, ఇల్లు ఇతరత్ర స్థిరాస్తుల విలువ రూ. 8 కోట్ల వరకు ఉన్నట్లు గత ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపారు. అయితే ఇప్పుడు వాటి విలువ మరికొంచెం పెరిగి ఉండొచ్చు. గజపతిరాజులపై బ‌రిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి సైతం త‌క్కువేమీ కాదు. ఆయన కూడా అదితి గజపతిరాజుకు స‌రి సమానంగా ఆస్తి కలిగిన వ్య‌క్తే కావడం గ‌మ‌నార్హం.

క్రితంసారి జ‌రిగిన ఎన్నికల్లో ఎన్నికల సంఘానికి ఆయ‌న సమర్పించిన అఫిడవిట్ వివ‌రాల‌ ప్రకారం ఆస్తులు ఇలా ఉన్నాయి. ఆయన మొత్తం ఆస్తుల విలువ 13.71 కోట్లు ఉండ‌గా రూ. 3.85 కోట్ల అప్పు ఉంది. బ్యాంకుల్లో డిపాజిట్లు, బంగారం అన్నీ కలిపి రూ.2 కోట్ల వరకు ఉండగా భారీగా వ్యవసాయ భూములు కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఓపెన్ ప్లాట్లు, కమర్షియల్ బిల్డింగులు, ఇల్లు కలిపి ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 12.15 కోట్లు ఉంది.

కాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఆస్తుల విలువ రూ. 8 కోట్లు ఉండ‌గా, అప్పులు 1.5 కోట్లు ఉన్నాయి. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటూ మంత్రి ప‌ద‌వితోపాటు కీల‌క వ్య‌క్తిగా ప‌నిచేశారు. అన్ని బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు, బంగారం, కార్లు వంటి విలువ మొత్తం రూ. 3.60 కోట్ల వరకు ఉంది. విజ‌య‌న‌గ‌రం చుట్టుప‌క్క‌ల‌ వ్యవసాయ భూములు, ప్లాట్లు ఉన్నాయి. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో మార్కెట్ విలువ చూపించారు.

230 -3

కానీ బ‌హిరంగ మార్కెట్‌లో ఈ ఆస్తుల విలువ ఎక్కువే ఉంటుంది. అలాగే కమర్షియల్ బిల్డింగ్‌లు, ఇల్లు కలిపి మొత్తం విలువ రూ. 4.60 కోట్ల వరకు ఉంటుందని ఆయ‌న త‌న అఫిడవిట్‌లో చూపించారు. మొత్తంగా మంత్రి బొత్ససత్యనారాయణ ఆస్తుల‌ విలువ రూ. 8.5 కోట్లు ఉన్న‌ట్లు అఫిడ‌విట్‌లో చూపించారు. ఇక బొత్స అప్పలనర్సయ్య విషయానికి వస్తే రూ.5.28 కోట్ల విలువైన ఆస్తులు, రూ. 23 లక్షల అప్పులు ఉన్న‌ట్లు అఫిడ‌విట్‌లో చూపించారు.

బ్యాంకుల్లో డిపాజిట్లు, బంగారం, వాహనాల విలువ మొత్తం కలిపి ఒక కోటీ 80 లక్షలు ఉండగా, వ్యవసాయ భూములు, ఇల్లు, ప్లాట్లు మిగ‌తా ఆస్తులు అన్నీ కలిపి మరో 3.5 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. బ్యాంకుల్లో తీసుకున్న అప్పు రూ. 23 లక్షల వరకు ఉంది. విజయనగరం ఎంపీగా బ‌రిలో దిగుతున్న బెల్లాన చంద్రశేఖర్‌కు రూ. 2.10 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, రూ.1.11 కోట్ల అప్పులు ఉన్నాయి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?