Killi Kruparani : కేంద్ర మాజీ మంత్రి కృపారాణి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా...?

Killi Kruparani : కేంద్ర మాజీ మంత్రి కృపారాణి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా...?

Killi Kruparani : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవతరంగా మారుతున్నాయి. ముఖ్యమైన నేతలు ఒక పార్టీ నుండి ఒక పార్టీకి వెళ్తుండగా రాజకీయాలలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీకాకుళం జిల్లా కీలక వైసీపీ మహిళా నేత కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

వాస్తవానికి కృపారాణి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీకాకుళంలో ఎంపీగా పోటీ చేశారు.ఇక ఆ సమయంలో రాష్ట్ర విభజన వలన ఆమెకు అతి తక్కువ ఓట్లు వచ్చాయి. అంతకంటే ముందు 2009 ఎన్నికల్లో టీడీపీ దిగ్గజ నేత ఎర్రనాయుడుని ఆమె ఓడించి లేడీ కిల్లర్ అనిపించుకున్నారు. అంతేకాదు ఆనాటి యూపీయే టూ ప్రభుత్వంలో కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పదవి కూడా ఆమెను వరించింది.

అలాగే 2014 ఎన్నికల కంటే ముందు వైసీపీ పార్టీ ఆమెను పార్టీలోకి ఆహ్వానించగా దానికి ఆమె నిరాకరించారనే వాదనలు కూడా ఉన్నాయి. ఇక 2019లో మనసు మార్చుకుని ఆమె వైసీపీ పార్టీలోకి చేరడం జరిగింది. కానీ ఆ సమయంలో అభ్యర్థుల ప్రకటన అప్పటికే ఖరారు చేయడంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది.

2 -3

అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా వైసీపీ అధ్యక్షురాలుగా ఆమె పనిచేశారు. వాస్తవానికి ఆమె రాజ్యసభ సీటు ఆశించారు కానీ అది దక్కలేదు. దీంతో పార్టీపై ఆమెకు కాస్త అసంతృప్తి ఉందని తెలుస్తోంది. అంతేకాక ఆమె పార్టీని జిల్లాలో విస్తరింప చేయలేదని వైసీపీ నేతలను కలుపుకొని పోలేదని భావించిన వైసీపీ అధిష్టానం ఆమె ప్లేస్ లో ధర్మాన కృష్ణ దాస్ ను నియమించారు.

ఆ తర్వాత టెక్కలి అసెంబ్లీ సీటు కావాలని ఆమె కోరగా శ్రీకాకుళం ఎంపీ సీట్ నుంచి పోటీ చేయాలని అధిష్టానం భావించింది. కాని చివరికి ఏమైందో తెలియదు కానీ శ్రీకాకుళం ఎంపీ టికెట్ , టెక్కలి ఎమ్మెల్యే టికెట్ రెండు కూడా ఆమెకి ఇవ్వలేదు. దీంతో కృపారాణి వైసీపీ పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అందరూ కృపారాణి టీడీపీ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అనుకున్నారు.

2 -2

కానీ టీడీపీ పార్టీలో ఆమెకు కోరుకున్న సీటు దక్కే అవకాశం లేదు. దీంతో కాంగ్రెస్ లో చేరినట్లయితే ఆమె కోరుకున్న సీటు దక్కే అవకాశం ఉందని కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరడం బెటర్ అని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆమె హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో భెటి అయినట్లుగా వార్తలు వచ్చాయి.

కావున త్వరలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి శ్రీకాకుళం ఎంపీ స్థానం నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఆమె కాకపోయినా తన కుమారుడు విక్రాంత్ ని ఆ స్థానం నుంచి పోటీ చేయించేందుకు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి కృపారాణి కాంగ్రెస్ పార్టీలో చేరితే వైసీపీకి నష్టం ఏమైనా ఉందా...?మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?