Modi Mega Road Show : విజయవాడలో మోదీ భారీ రోడ్ షో.. పవన్, చంద్రబాబు హాజరు..

Modi Mega Road Show : విజయవాడలో మోదీ భారీ రోడ్ షో.. పవన్, చంద్రబాబు హాజరు..

Modi Mega Road Show : ఏపీలో ఎన్నికల హడావుడి మాములుగా లేదు. ఒకేసారి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. పార్టీలన్నీ ప్రజల్లోకి వెళ్లి తమ పార్టీకే ఓటేయాలంటూ బతిమిలాడుకుంటున్నాయి.

ఎన్నికలకు ఇంకా 5 రోజుల సమయం కూడా లేదు. ఇంకో మూడు రోజుల్లో ఎన్నికల ప్రచారం కూడా ముగియబోతోంది. అందుకే ప్రధాన పార్టీలు తమ పార్టీల అధినేతలతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. 

ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలను తమ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. తమ పార్టీని మళ్లీ గెలిపిస్తేనే ఏపీలో సంక్షేమ పథకాలు కంటిన్యూ అవుతాయని జగన్ నొక్కి మరీ చెబుతున్నారు. 

089 -3

ఇంకో వైపు ఏపీలో కూటమిగా ఏర్పడ్డ టీడీపీ, బీజేపీ, జనసేన.. ఈ మూడు పార్టీల నేతలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఏపీలో ఇప్పటి వరకు చంద్రబాబు, పవన్.. ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఎన్నికల ప్రచారం ప్రారంభం కాగానే ప్రధాని మోదీ వచ్చి ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మళ్లీ తాజాగా ఇవాళ ఏపీకి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఏపీలో ఎన్నికల ప్రచారానికి ముగింపు పలికారు. 

Modi Mega Road Show : మోదీకి ప్రజల బ్రహ్మరథం

విజయవాడలో ప్రధాని మోదీ మెగా రోడ్ షో నిర్వహించారు. ఈసందర్భంగా ప్రధాని మోదీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మున్సిపల్ స్టేడియం నుంచి ఈ రోడ్ షో ప్రారంభం అయింది. ఈ రోడ్ షోలో ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

089 -4

మూడు పార్టీల అగ్రనేతలు ముగ్గురూ ఒకే వేదికపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహించారు. కూటమి గెలుపే లక్ష్యంగా ప్రధాని మోదీ ఏపీలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా 5 వేల మందితో హై సెక్యూరిటీ మధ్య మోదీ రోడ్ షో నిర్వహించారు. 

ఇప్పటి వరకు మోదీ నాలుగు బహిరంగ సభలకు ఏపీకి వచ్చారు. ముందుగా చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభకు మోదీ విచ్చేశారు. రెండో విడతలో భాగంగా రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేటలోని సభకు వచ్చారు. రాజంపేట సభ తర్వాత మోదీ విజయవాడ రోడ్ షోలో పాల్గొన్నారు. 

ఈసందర్భంగా మాట్లాడిన మోదీ.. ఏపీలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. వికసిత ఆంధ్రా ఎన్డీఏతోనే సాధ్యం అన్నారు. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం అన్నారు. పీఎం ఆవాస్ యోజనతో ఏపీలో 10 లక్షల ఇళ్లు నిర్మించామన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద 1.25 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారన్నారు. 

089 -5

జల్ జీవన్ మిషన్ తో కోటి ఇళ్లకు నీరు ఇచ్చామన్నారు. కిసాన్ సమ్మాన్ నిధితో ఒక్క పల్నాడుకే 700 కోట్లు ఇచ్చామన్నారు. ఏపీని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చామన్నారు. విశాఖలో ఎంఐఎం, ఐఐపీఈ ఏర్పాటు చేశామన్నారు. తిరుపతిలో ఐఐటీ, ఐసర్ ఏర్పాటు చేశామన్నారు. మంగళగిరి ఎయిమ్స్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించామన్నారు.

అలాగే.. విజయనగరం ట్రైబల్ వర్సిటీ నిర్మాణం బీజేపీ ఘనతే అన్నారు మోదీ. మొత్తం మీద ఏపీలో ప్రధాని మోదీ ఇవాళ్టితో ఎన్నికల ప్రచారానికి విజయవాడ రోడ్ షోతో ముగింపు పలికారు. అందుకే ఈ రోడ్ షోకు భారీగా విజయవాడ ప్రజలు తరలివచ్చారు. రోడ్ షో మొత్తం ఎక్కడ చూసినా మోదీ మోదీ అటూ నినాదాలు హోరెత్తాయి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?