బీఆర్ఎస్ పార్టీ మాయమాటలతో ప్రజలను వంచించింది

ప్ర‌జాదీవెన స‌భ‌లో మంత్రి సీత‌క్క‌

బీఆర్ఎస్ పార్టీ మాయమాటలతో ప్రజలను వంచించింది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, క్విక్ టుడే : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అహర్నిశలు కృషి చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్న అని మంత్రి సీతక్క అన్నారు. మణుగూరు ఐటిఐ గ్రౌండ్ లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా దీవెన భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి సీతక్క బహిరంగ సభకు విచ్చేసిన అశేష జనావాహినిని ఉద్దేశించి మాట్లాడారు. గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మాయమాటలతో ప్రజలను వంచించి అధికారం చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేసిందని అన్నారు.

114

అమలుపరచని పథకాలను ప్రజలకు చేరవేసి నిండా ముంచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తది చెయ్యనివి చెప్పదు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. గత మూడు నెలల క్రితం 6 గ్యారంటీలు పథకాలను అమలు చేస్తామని చెప్పి 90 రోజులు గడవక ముందే 6 గ్యారంటీలను అమలు చేశామని అన్నారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈమధ్య కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ లో భాగంగా ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తున్నారన్న అక్కసు తో లేనిపోని అవాకులు చెవాకులు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బురద చల్లే మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆనాడు ఆంధ్ర వాళ్లకు అరికాలకు ముల్లు గుచ్చిన పం టి తో తీస్తానని అన్నది మీరు కాదా అని గుర్తు చేశారు. పది సంవత్సరాలు టిఆర్ఎస్, బీ అర్ ఎస్ పార్టీలో మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థులుగా బరిలో నిలిచి గెలిచి, ఎంపీగా ఉండి నియోజకవర్గాలను గాలికి వదిలేసారని అన్నారు. కనీసం పార్లమెంటులో మాట్లాడిన దాఖలాలు కూడా లేవని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో,  ప్రజల మనిషి నిత్యం ప్రజలతో మమేకమై ఉండే వ్యక్తి కేంద్ర మాజీ మంత్రి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి  పో రిక బలరాం నాయక్ ను తమ ఓటు ద్వారా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?