నల్లగొండ జిల్లా ప్రతినిధి.మార్చి 13. (క్విక్ టుడే) : నల్లగొండ పార్లమెంట్ బిజెపి అభ్యర్థిగా హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని అధిష్టానం ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ రెండో విడత విడుదల చేసిన లిస్టులో శానంపూడి సైదిరెడ్డిని ప్రకటించారు . మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బోనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు మొదటి విడత లోనే భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. నల్లగొండ పార్లమెంట్ పరిధిలో రెడ్డి సామాజిక వర్గం నుండి నిలబెట్టాలని ఆలోచనతో అధిష్టానం నిర్ణయం తీసుకుంది. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన శానంపూడి సైదిరెడ్డి, హుజూర్నగర్ ప్రాంతంలోని బిజెపి కార్యకర్తలపై అనేక కేసులను గురిచేసి ఇబ్బందులకు గురి చేశారు, పార్టీ అధిష్టానం ప్రస్తుతం నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడంతో హుజూర్నగర్ నియోజకవర్గ కార్యకర్తలు ఈ మేరకు సహకరింస్తా రనేది వేచి చూడవలసిందే. భారతీయ జనతా పార్టీ అధిష్టానం మహబూబ్నగర్ చెందిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని నల్లగొండ పార్లమెంట్ బరిలో నిలుపాలని ఆలోచించినప్పటికీ జితేందర్ రెడ్డి సుముకతా చూపలేదు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి గొంగిడి మనోహర్ రెడ్డిని సైతం నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా పరిశీలించినప్పటికీ, తను ప్రాతినిధ్యం వహించే మునుగోడు నియోజకవర్గం భువనగిరి పరిధిలో ఉండడంతో ఆయన సహితం సుముకుత చూపలేదు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బండారు ప్రసాద్, నూకల నరసింహారెడ్డి గోలీ మధుసూదన్ రెడ్డి లాంటి నాయకులు టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం క్షణపూడి సైదిరెడ్డికి టికెట్ కేటాయించింది. ఇటీవల పార్టిలో చేరిన షానపూడి సైదిరెడ్డికి నల్లగొండ పార్లమెంట్ టికెట్ ఇవ్వవద్దని అధిష్టానానికి బిజెపి సీనియర్ నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు. భాగ్యరెడ్డి లాంటి నాయకులు ఎంతో మంది ఫిర్యాదు చేసినప్పటికీ, పార్టీ అధిష్టానం అతనీకె టికెట్ కేటాయించింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్తలు నాయకులు శానంపూడి సైదిరెడ్డికి ఏ మేరకు సహకరిస్తారనేది వేచి చూడవలసిందే.