Minister Komatireddy Venkat Reddy: ఎమ్మెల్సీ క‌విత అరెస్టుపై మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Minister Komatireddy Venkat Reddy: ఎమ్మెల్సీ క‌విత అరెస్టుపై మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Minister Komatireddy Venkat Reddy నల్లగొండ జిల్లా ప్రతినిధి. మార్చి 16 (క్విక్ టుడే) : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌కు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చిన సంఘటనపై రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమా టోగ్రాఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు, తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అని ప్రశ్నించారు.

కవితను అరెస్ట్ చేసింది ఢిల్లీ పోలీసులైతే.. తెలంగాణలో ధర్నాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని మండిపడ్డారు. నాడు చంద్రబాబు అరెస్టు సందర్భంగా జరిగిన ధర్నాలను, ర్యాలీలను అడ్డుకున్న వ్యక్తులే ఇవాళ ధర్నాలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన విషయాలకు హైదరాబాద్‌లో ధర్నాలెందుకని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు.. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారులు అరెస్టు చేస్తే తెలంగాణలో ధర్నాలకు ఎందుకు పిలుపునిస్తున్నారని ప్రశ్నించారు. 

165 -2
ప్రాజెక్టుల నిర్మాణంలో అక్రమంగా సంపాదించిన డబ్బుతో స్పెషల్ ఫ్లైట్లు బుక్ చేసి బీఆర్ఎస్ కార్యకర్తలను ఢిల్లీకి తీసుకపోయి ఈడీ ఆఫీసు ముందు ధర్నాలు దీక్షలు చేసుకోండి అని హితవు పలికారు. ఎవడొస్తడో రండి చూసుకుందాం అని తొడకొట్టి..ఇప్పుడు కార్యకర్తలను రోడ్లమీదకి తేవడం ఎందుకు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పాలనతో ప్రజల జీవితాల్లో ఇప్పుడిప్పుడే వెలుగులు నిండుతున్నాయి అన్నారు.

మళ్లీ మీ కుటిల రాజకీయాలతో తెలంగాణ ప్రజల్ని ఇబ్బందులు పెట్టకండని హితవు పలికారు. ఏపీ ముఖ్యమంత్రితో కుమ్మక్కై రాయలసీమకు నీళ్లివ్వడం మూలంగా ఇవాళ తెలంగాణ ప్రాజెక్టులన్నీ అడుగంటిపోయాయని తెలిపారు. రైతులు కరువుతో అల్లాడితోపోతుంటే.. మీ లిక్కర్ రాజకీయాలకు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చాలనుకుంటున్నారా..? అని ఘాటుగా కోమటిరెడ్డి స్పందించారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?