విశాఖపట్నం, మే29 (క్విక్ టుడే న్యూస్):- అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం ను గురువారం ఉదయం.. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ పరామర్శించారు. ఈ సందర్భంగా రామ్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు తండ్రి పల్లా సింహాచలం గడచిన కొంతకాలంగా కాలేయ క్యాన్సర్ తో బాధపడుతున్నారన్నారు.

పల్లా సింహాచలం త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు. పల్లా సింహాచలం ఎంతో మంచి వ్యక్తి అని, అందరికీ మేలు చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తులు, ఈ సమాజానికి ఎంతో అవసరం ఉందన్నారు. అప్పటి విశాఖపట్నం -2 నియోజకవర్గం శాసన సభ్యుడిగా తన వంతు అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేసుకున్నారు. పల్లా సింహాచలం కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్నారు. ఏది ఏమైనాపటికి ఆయన త్వరగా కోలుకోవాలని బి.వి.రామ్ ఆకాంక్షించారు. పల్లా సింహాచలం ను బి.వి.రామ్ పరామర్శిస్తున్న సమయంలో పల్లా సింహాచలం కుమార్తె పులిచెర్ల రాజేశ్వరి, కుమారుడు పల్లా శంకర్రావు, మనవడు పల్ల కార్తీక్ ఇతర బంధువులు, కోడె బాబురావు తదితరులు ఉన్నారు.