మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే.. టిడిపి పరిస్థితి ఏంటి?
సోషల్ మీడియాలో ఈ విషయాలను మనం ప్రత్యేకంగా చూసిన వారిమే. కొందరు నేతలు అయితే దారుణంగా ప్రతిపక్ష పార్టీ నేతలను బూతులతో తిట్టుకుంటూ రెచ్చిపోయారు. దీంతో ఆ ఎలక్షన్లలో వైసిపి పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అయితే అదే బాటలో టిడిపి నేతలు నడవకూడదని.. టిడిపి హై కమాండ్ ఆదేశాలను జారీ చేసింది. పార్టీలోని నేతలకు స్పష్టమైన సూచనలు చేస్తూ ఎలా నడుచుకోవాలో టిడిపి హై కమాండ్ సూచనలు చేస్తుంది. కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆనాడు ఇబ్బందులు పెట్టిన నేతలను ఈనాడు జైలు పాలు చేస్తున్నారు. అయితే టిడిపికి ఇది భవిష్యత్తులో మళ్లీ ముప్పుగా మారుతుందని ఆలోచనతో ... చాలా జాగ్రత్త పడుతుంది. కూటమినేతలకు సంబంధించిన వారు ఎవరైనా కూడా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులను పెట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది టిడిపి. అలాగే వివాదాలకు దూరంగా ఉండాలని సూచనలు చేస్తుంది. పార్టీ లోని ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించాలని పార్టీ హై కమాండ్ హెచ్చరిస్తుంది.