జగన్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు ఆపాలి?
On
విశాఖ రూరల్ ప్రతినిధి, మే 29 (క్విక్ టుడే న్యూస్):-
ఆముదాలవలస: వైఎస్ జగన్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఎవరెవరు ఏ అక్రమాల్లో ఉన్నారో తెలుసునని బెదిరింపులకు దిగుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం ఆముదాలవలసలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ కార్యకర్తలు జగన్ మాటలు విని వారి కుటుంబాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.
జగన్ మాటలు నమ్మొద్దని, ఆయన రాజకీయ శైలి రౌడీయిజమని ధ్వజమెత్తారు. తాజాగా కడపలో ప్రారంభమైన తెలుగుదేశం మహానాడు అద్భుతంగా జరుగుతోందని, ఈ ఉత్సాహాన్ని చూసి వైసిపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు. మేళా తరహాలో జరుగుతున్న మహానాడుకు బహుళ ప్రజల సమీకరణ, ఉత్సాహం, క్రమశిక్షణతో వైసిపి నేతల్లో అసహనం పెరిగిందని తెలిపారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పనిలో కూటమి ప్రభుత్వం ఉన్నదని, పాలన సవ్యంగా సాగుతోందని అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజల గర్వంగా నిలిచే ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు జీఓ విడుదల చేయడం తెలుగు జాతికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ప్రతి తెలుగువాడు దీన్ని హర్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం బి.వి. రామ్, ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి గుండు అప్పల సూర్యనారాయణను అరసవెల్లిలోని ఆయన నివాసంలో కలసి పరామర్శించారు.Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
