పేటీఎం కు భారీ ఊరట.. సూపర్ ఆఫర్ ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్..

పేటీఎం కు భారీ ఊరట.. సూపర్ ఆఫర్ ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్..

ఇటీవల పేటీఎం పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పేటీఎంలో వందలాది అకౌంట్లకు సరైన ఐడెంటిఫికేషన్ లేదని ఆర్బీఐ తీవ్ర అసహనంతో ఆ కంపెనీ పై ఆంక్షలు విధించింది. ముఖ్యంగా ఆయా అకౌంట్ సరైన విధంగా చేయకుండానే నడుస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ గుర్తించింది. అయినా అదే ఖాతాలనుంచి కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ కారణంగా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగే ప్రమాదం ఉందని తేల్చి చెప్పింది. వెయ్యికి పైగా అకౌంట్స్ ఒకటే పాన్ నెంబర్ తో లింక్ అయి ఉండడం ఆందోళన కలిగించింది. అయితే తాజాగా పేటిఎం పేరెంట్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మర్చంట్ పేమెంట్స్ సెటిల్మెంట్ కోసం దిగ్గజ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ తో డీల్ కుదుర్చుకుంది. 

 ఈ మేరకు వన్97 కమ్యూనికేషన్ తన నోడల్ అకౌంట్ ని పేటీఎం పేమెంట్స్ బ్యాంకు నుంచి యాక్సిస్ బ్యాంకుకు ఇప్పుడు మార్చింది. దీంతో పేటీఎం క్యూఆర్ కోడ్ సహా పేటీఎం సౌండ్ బాక్స్, పేటీఎం కార్డ్ మిషన్ సేవలు ఇలా అన్ని కూడా మార్చి 15 న తర్వాత యధావిధిగా కొనసాగుతాయని సంస్థ తెలిపింది. నోడల్ అకౌంట్ అంటే సంస్థ ఖాతాదారులు వ్యాపారుల లావాదేవులు అన్నింటిని ఈ ఖాతా ద్వారా సెటిల్మెంట్ చేస్తారు. యాక్సిస్ బ్యాంకు తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేటిఎం ఫిబ్రవరి 16న ప్రకటన చేసింది. యాక్సిస్ బ్యాంకు తో తెరిచి ఎస్రో అకౌంట్ ద్వారా మార్చినట్లు తెలిపింది. దీంతో ఎప్పటిలాగే తమ వ్యాపార లావాదేవీలు జరుగుతాయని తెలిపింది. ఇంకా పేటీఎం పేమెంట్ బ్యాంకు కాకుండా మరో బ్యాంక్ అకౌంట్ కు లింక్డ్ చేసిన ఫండ్ లావాదేవీలు కలిగిన వ్యాపారులు అంతరాయాల గురించి ఆందోళన చెందనక్కర్లేదని పేటిఎం పేర్కొంది. 

గతంలో పేమెంట్స్ బ్యాంకు పై ఆంక్షలు ఫిబ్రవరి 29 దాకా వస్తాయని ఆర్బీఐ చెప్పింది. ఇప్పుడు దాని కోసం మరో 15 రోజులు సమయం ఇచ్చింది. ఇప్పుడు పేటీఎం కి మార్చి 15 వరకు సమయం ఉంది. అంటే కస్టమర్లు ఆలోగా ఇతర బ్యాంక్ అకౌంట్లు మారడం వంటి ప్రత్యామ్నాయలు చూసుకునేందుకు సమయం ఉంటుందని భావించింది. ఫాస్టాగ్ కు సంబంధించి అందులో ఉన్న బ్యాలెన్స్ ముగిసే వరకు ఉపయోగించుకోవచ్చు అని ఇది మార్చి 15 తర్వాత కూడా పని చేస్తుందని తెలిపింది. టాప్ అప్ చేసుకునే అవకాశం ఉండదని తెలిపింది. పేటియం లావాదేవీల పై కస్టమర్లు తరచుగా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలతో కూడిన డాక్యుమెంట్ ను ఆర్బీఐ ఫిబ్రవరి 16 నవిడుదల చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కాకుండా ఇతర బ్యాంక్ అకౌంట్లతో లింక్ అయి ఉన్న పేటీఎం క్యూఆర్ సౌండ్ బాక్స్ పేమెంట్ మిషన్లు వంటివి మార్చి 15 తర్వాత కొనసాగుతాయని ఆర్బీఐ తెలిపింది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?