metal for electric vehicles: సముద్ర గర్భంలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ మెటల్.. ఇక చైనా, రష్యాకు పోటాపోటీగా భారత్..

metal for electric vehicles: సముద్ర గర్భంలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ మెటల్.. ఇక చైనా, రష్యాకు పోటాపోటీగా భారత్..

metal for electric vehicles: హిందూ మహాసముద్రంలో అన్వేషణ కొనసాగించటానికి ఇప్పటివరకు భారత్ వద్ద రెండు డీప్ ఎక్స్ ఫ్లోరేషన్ లైసెన్సు లు ఉన్నాయి. ఎంతో ప్రత్యేకమైన ఈ సముద్ర ఖనిజాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో శక్తివంతమైన దేశాలు పోటీ పడుతున్నాయి. అయితే ఈ రేస్ లోకి మన భారత్ కూడా చేరింది. సముద్ర గర్భంలో ఎన్నో కిలోమీటర్ల కింద పెద్ద ఎత్తున ఉన్న కోబాల్ట్, కాపర్, నికెల్, మాంగనీస్ ఇతర ఖనిజాలను కూడా దక్కించుకోవటానికి చైనా,రష్యాలతో పాటుగా భారత్ కూడా పోటీ పడుతుంది.

వాతావరణ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయంగా భావించిన సౌర,ఎలక్ట్రిక్ వాహనాలు, వాయు విద్యుత్తు, బ్యాటరీ టెక్నాలజీలో ఈ ఖనిజాల పాత్ర ముఖ్యమైనది. ఈ వారంలో మైనింగ్ లైసెన్సు విధి విధానాలు చర్చించటానికి దానికి సంబంధించిన సభ్య దేశాలు కూడా జమేకాలో సమావేశమయ్యాయి. భారత్ చేసిన కొత్త దరఖాస్తులను ఐఎస్ఏ ఆమోదించినట్లయితే భారత్ కూడా సముద్రంలోని ఖనిజాల అన్వేషణకు లైసెన్స్ రష్యాతో పాటుగా చైనా కంటే ఒకటి తక్కువగా ఉన్నట్టు అవుతుంది.

దీనికి సంబంధించిన ఐఎస్ఏ న్యాయ సాంకేతిక కమిషన్ కొన్ని కామెంట్స్ ప్రశ్నలతో కూడుకున్న జాబితాను భారత్ ప్రభుత్వానికి పంపినట్లుగా డాక్యుమెంట్ ద్వారా తెలిపింది. అయితే ఈ ప్రాంతాన్ని ఇప్పటివరకు ఏ దేశం కోరుతుందని దీనిపై భారత్ ప్రతిస్పందన కూడా అడిగినట్లుగా ఐఎస్ఏ తెలిపింది. దరఖాస్తులకు ఆమోదం వస్తుందా లేదా అనే విషయాలను పక్కన పెడితే గనుక సముద్ర అడుగున్న ప్రత్యేకమైన ఖనిజాల ను బయటకు తీసే విషయంలో  వెనకబడకుండా ఉండటానికి భారత్ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమైంది.

హిందూ మహాసముద్రంలో పెద్ద ఎత్తున విస్తరించిన అద్భుతమైన ఖనిజాల నిల్వలు సముద్రంలో అగాధాలను తవ్వి తీయటానికి భారత్ ను ఉసు గొలుపుతున్నాయి.  మహాసముద్రంలోని పర్వత ప్రాంతాలలో గల పాలి బెటాలిక్ సల్ఫర్ ను బయటకు తీయటానికి ఇప్పటివరకు ఇండియా, జర్మనీ, సౌత్ కొరియా, చైనా భారతదేశానికి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ మహాసముద్రంలో 5.270 మీటర్ల లోతులో ఖనిజాలు  బయటకు తీయటానికి యంత్రాల సామర్థ్యాన్ని కూడా 2022లో పరీక్షించారు.

2302 -1

కొన్ని పాలి మెటాలిక్ నాడ్యూల్స్ బంగాళదుంప ఆకారంలో సముద్ర అడుగున లభించే శిలలు వీటిలో నాణ్యమైన మాంగనీస్, కాపర్ వీటన్నింటినీ  సేకరించింది. సముద్ర లోతులో ఖనిజాల బయటికి తీయటానికి భారత ప్రణాళికకు సంబంధించిన  ప్రశ్నలకు స్పందించడం లేదు. భారత్ తన సొంత హక్కుల విషయంలో ఎంతో శక్తివంతంగా ఉంటుందో చాటి చెప్పాలని భావించింది. అలాగే లోతైన  సముద్ర జలాల్లో ఖనిజాల అన్వేషణ చెయ్యనంత మాత్రాన మేము వెనకబడలేదు అని చెప్పటానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది.

సముద్ర గర్భంలో తవ్వకాలు భూమిపై చివరి ఆప్షన్. ఖనిజాల  తవ్వకం మానవాళిని కోలుకోలేని నష్టం కలిగిస్తుందని పర్యావరణ శాఖ తెలియజేసింది. దీని గురించి సమాచారం లేకపోవటం వల్ల తవ్వకాలను ఆపటానికి తాత్కాలికంగా విరామం ప్రకటించటం జరిగింది. యూకే, జర్మనీ, బ్రెజిల్, కెనడా దాదాపు 20 కి పైగా దేశాలు డిమాండ్ చేశాయి. క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ డిమాండ్ ను అందుకోవడానికి 2050 నాటికి ప్రత్యేకమైన ఖనిజాల తవ్వకం 5 రేట్లు పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

భారత్ తనకు ఉన్న ఇంధన అవసరాలలో సగం భాగాన్ని పునరుత్పాదక శక్తి ద్వారా తీర్చడానికి వీలుగా 2030 నాటికి 500 గిగా వాట్స్ పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయటానికి స్వల్ప కాలిక లక్ష్యాన్ని పెట్టుకుంది. అంతే 2070 నాటికి కర్బన ఉద్గాలను స్థాయిలోకి చేర్చాలని లక్ష్యాన్ని పెట్టుకుంది. సముద్రాల లోతుల్లో ఖనిజాలు బయటకు తీయటానికి సమర్ధించినవారు భూమిపై ఖనిజాల తవ్వకం గరిష్ట స్థాయికి చేరుతుందని తెలిపారు. దానివల్ల నాసిరక ఖనిజాల ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. అంతేకాక ఎన్నో ఖనిజ వనరుల ప్రాంతాలు పర్యావరణ సమస్యలు పడతాయని తెలిపింది.

 ప్రస్తుత అవనిలో ఖనిజాలు బయటికి తీయటానికి కొన్ని దేశాలు ఆధిపత్యం చాటాయి. లిథియం ఉత్పత్తిలో ఆస్ట్రేలియా,కాపర్ ఉత్పత్తిలో  చైనా,గ్రాఫైట్,స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ వినియోగించటానికి రేర్ ఎర్త్ మూలకాల ఉత్పత్తిలో కూడా ఆధిపత్యం చూపుతున్నారు. ఖనిజాల శుద్ధిలో చైనా ఆధిపత్యంపై భౌగోళిక, రాజకీయ ఆందోళనలు  కొన‌సాగుతున్నాయి. ఇంటర్నేషనల్ రెన్యువల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం దశాబ్దాల తరబడి ఖనిజాలను శుద్ధి చేసే విషయంలో చైనాకు ఇంతవరకు ఎదురులేరు.

2302 -2

కోబాల్ట్ పై 70 శాతం శుద్ధి చేసిన లిథియం,మాంగనీస్ దాదాపు 60 శాతం ఆధిపత్యం కలిగి ఉంది అని తెలిపారు. దీనికి తోడుగా ప్రస్తుతం కొన్ని ప్రాసెసింగ్ టెక్నాలజీల పై బీజింగ్  నిషేధిస్తుంది.ఈ రంగంలో చైనా ఆధిపత్యానికి అమెరికా ఎన్నో పశ్చిమ దేశాలు ఖనిజ భద్రత భాగస్వామ్యాన్ని 2022లో మొదలుపెట్టింది. కీలక ఖనిజాల సరఫరా పెట్టుబడులకు ఈ భాగస్వామ్యం ఉత్పారకంగా నిలిచింది. ఇప్పుడు ఇండియా కూడా ఇందులో భాగస్వామిగా ఉంది.

లోతైన సముద్ర గర్భ మైనింగ్ లో అభివృద్ధి చేయటానికి రష్యా ఒక ఒప్పందంపై ఇండియా సంతకం చేసింది. పెరుగుతున్న ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కీలక ఖనిజాలను బయటకు తీసి,శుద్ధి చేసి వినియోగించటానికి వేగంగా పనులు చేస్తున్నట్లు పిరాక్సిన్ తెలిపారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?