Business Ideas : త‌క్కువ పెట్టుబ‌డితో వ్యాపారాన్ని ప్రారంభించండి ఇలా.. ఇక నిరంత‌రం లాభ‌దాయ‌క‌మే..

Business Ideas : త‌క్కువ పెట్టుబ‌డితో వ్యాపారాన్ని ప్రారంభించండి ఇలా.. ఇక నిరంత‌రం లాభ‌దాయ‌క‌మే..

Business Ideas : ప్రపంచవ్యాప్తంగా కరోనా బీభత్సం సృష్టించిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితాలలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. ఇదే సమయంలో ఉద్యోగాలకు సైతం భద్రత లేకుండా పోవడంతో ప్రతి ఒక్కరు కూడా వ్యాపారాలను పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది ఉద్యోగాలను వదిలేసి సొంతంగా వ్యాపారాలు కూడా ప్రారంభించారు. మరి కొందరు సొంతంగా యూట్యూబ్  చానల్స్ పెడుతూ వారి బిజినెస్ మరింత పెంచుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ వస్తున్నారు.

అయితే మీరు కూడా మంచి బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తున్న వారు అయితే ఈ కథనం మీకోసం. ఇంట్లోనే ఉండి అతి తక్కువ పెట్టుబడి తో వ్యాపారం చేయగలిగే కొన్ని లాభదాయకమైన బిజినెస్ లను ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం. మరి ఆ బిజినెస్ ఏంటి..? వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


ఆయిల్ బిజినెస్..

23 -2

ప్రస్తుతం ఉన్న కాలంలో అతివేగంగా విస్తరిస్తున్న బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది ఫుడ్ బిజినెస్ అని చెప్పాలి. ఈ బిజినెస్ ను ఇప్పటికే చాలామంది చేస్తున్నారు. అయితే ఈ బిజినెస్ లో ఎక్కువగా ఉపయోగించేది ఆయిల్ మాత్రమే. ఇక ఈ ఆయిల్ లేకపోతే ఏ ఫుడ్ కూడా అంత టేస్ట్ గా అనిపించదు. అందుకే ప్రస్తుతం మార్కెట్ లో వంటనూనెకు విపరీతమైన డిమాండ్ ఉంది.

అందుకే ఇది నిరంతరం లాభదాయకమైన వ్యాపారంగా పిలవబడుతుంది. దీనినే మీరు వ్యాపారంగా మలుచుకున్నట్లైతే అధిక మొత్తంలో లాభాలను గడించవచ్చు. అయితే ఈ వంట నూనె తయారీ బిజినెస్ ను ప్రారంభించడానికి మీకు ఆయిల్ ఎక్స్ పెల్లర్లు  అవసరమవుతాయి.  వీటి ధర దాదాపు 2 లక్షల వరకు ఉంటుంది.

అలాగే ఈ బిజినెస్ ప్రారంభించడానికి మొత్తం సెట్ అప్ దాదాపు 3 నుండి 4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంతేకాదు మీరు నేరుగా రైతులను సంప్రదించి వంట నూనె తయారీకి కావాల్సిన ముడి సరుకును కొనుగోలు చేస్తే మరింత తక్కువ ధరకే లభిస్తాయి. తద్వారా అధిక రాబడి పొందవచ్చు. ఇలా తయారుచేసిన వంట నూనెను మార్కెట్లో విక్రయించడం చాలా సులువైన పని.

దీనికోసం మీరు మీ సమీప ప్రాంతంలో ఉన్న షాప్ లలో మార్కెటింగ్ చేసుకోగలిగితే చాలు మీకు విపరీతంగా ఆర్డర్స్ వస్తాయి. అలాగే మీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న పట్టణాల్లో ఉన్న మాల్స్ నిత్యవసర సరుకులు దొరికే స్టోర్స్ లో కాంట్రాక్టు తీసుకోవడం వలన అధిక మొత్తంలో లాభాలు పొందవచ్చు.

 సబ్బుల తయారీ...

23 -3

ప్రస్తుత కాలంలో నిత్యం ఉపయోగించే సబ్బు కి విపరీతమైన డిమాండ్ ఉంది. అంతేకాక ప్రతి ఇంట్లో ఇది ప్రాథమిక అవసరం కావడంతో చాలామంది ఎక్కువ మొత్తంలో వినియోగిస్తుంటారు. దీంతో ఏడాది పొడవునా మార్కెట్లో సబ్బు లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీనిని మనం బిజినెస్ గా మార్చుకున్నట్లయితే అధిక మొత్తంలో లాభాలు పొందవచ్చు. అంతేకాక దీనికోసం మీరు పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు.

ఈ వ్యాపారాన్ని మొదట మీరు 10 వేల పెట్టుబడి తో కూడా ప్రారంభించవచ్చు. తద్వారా మీ యొక్క బిజినెస్ ను విస్తరింప చేసుకోవచ్చు. ఒకసారి మీ సబ్బు డిమాండ్ అనేది మార్కెట్లో విపరీతంగా పెరిగితే మిమల్ని ఎవరు ఆపలేరు. అంతేకాక ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యాపారాలకు రుణాలను అందిస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

23 -4

ఇక ఈ బిజినెస్ లను ప్రారంభించ‌గానే లాభాలు రావాలంటే సాధ్యం కాదు. ఇందుకోసం చాలా స‌మ‌యం ప‌డుతుంది. మార్కెట్లో మ‌నం బ్రాండ్ కావాలి. అప్పుడే అది సాధ్య‌మ‌వుతుంది. అప్ప‌టి వ‌ర‌కు వేచి ఉండాల్సిందే. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు లోటుపాట్లు తెలుసుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది.

ఒక్క‌సారి బిజినెస్‌లో రాణించారంటే ఇక తిరుగు ఉండ‌దు.  ఆ దిశ‌గా అడుగులు ప‌డేవ‌ర‌కు విశ్రాంతి లేకుండా క‌ష్ట‌ప‌డాలి. అప్పుడే మ‌నం అనుకున్న ల‌క్ష్యాన్ని సుల‌భంగా చేరుకుంటాం. బిజినెస్ పెట్టాల‌నుకునే అంద‌రికీ ఆల్ ద బెస్ట్‌.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?