Business Idea : ఒక్కసారి పెట్టుబడితో రోజుకు 15 వేల ఆదాయం... ఈ బిజినెస్ ఐడియా సూపర్ గురూ...

Business Idea : ఒక్కసారి పెట్టుబడితో రోజుకు 15 వేల ఆదాయం... ఈ బిజినెస్ ఐడియా సూపర్ గురూ...

Business Idea :  ప్రస్తుత కాలంలో అవకాశాలను అందిపుచ్చుకున్న వారే మంచి ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉన్నత స్థాయిలో కనిపిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో డబ్బులు ఎక్కువగా సంపాదించాలనే భావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే డబ్బు కోసం ఉద్యోగాలు చేసేవారు కొందరైతే బిజినెస్ లు చేసేవారు మరికొందరు.

అలాగే మరి కొంతమంది కాలానికి అనుగుణంగా వారి ఆలోచనలకు పదును పెట్టి సరికొత్త ఉపాయాలతో మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. మరి ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఆధునికంగా వచ్చిన మార్పులతో మంచి ఆదాయాన్ని ఆశిస్తున్నవారు చాలామంది ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే ఒక రోజుకు 15000 సంపాదించగలిగే ఒక బిజినెస్ ఐడియా మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక ఈ బిజినెస్ ద్వారా మీరు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని పొందవచ్చు. మరి ఈ బిజినెస్ వివరాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

165 -2
మన తాతల కాలంలో వ్యవసాయం అనేది చాలా కష్టంగా ఉండేది. అంతేకాక శారీరక శ్రమ కూడా ఎక్కువగానే ఉండేది. దీంతో ఆనాటి కాలంలో వ్యవసాయం చేయాలంటే మనిషికి మనిషి అవసరమే ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు కాలం మారింది. వ్యవసాయం చేసే విధానంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే వ్యవసాయాన్ని సులభతరం చేసే ఆధునిక యంత్రాలు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. మరి ముఖ్యంగా పూర్వం రైతులు వ్యవసాయం చేసే క్రమంలో వరి సాగు కోసం ఎంతగానో శ్రమించేవారు. వరి కోత కోసి దానిని కట్టలుగా కట్టడానికి ఎంతో శ్రమించేవారు. అంతేకాక వరిగడ్డి వాము వేయడానికి కూడా దాదాపు రెండు మూడు రోజులు సమయం పట్టేది.

కానీ ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీతో వరి కోత మిషన్లు వచ్చాయి. దీంతో ఒక్కరోజులోనే ధాన్యాలు ఇంటికి చేరుతున్నాయి. ఇక మిగిలిన గడ్డి విషయానికి వస్తే వరికట్టలు కట్టడానికి కూడా మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఈ వరి గడ్డి కట్టలు కట్టే ప్రత్యేక యంత్రాలతో రైతులకు సైతం శారీరక శ్రమ తగ్గిపోతుంది.

165 -3

అయితే ప్రస్తుత కాలంలో ఈ టెక్నాలజీ విపరీతంగా పెరుగుతుందని చెప్పాలి. ఈ నేపద్యంలోనే పలువురు దీనిని బిజినెస్ గా మలుచుకుని ఆదాయాన్ని పొందుతున్నారు.ఈ క్రమంలోనే ఈ గడ్డి చుట్టే యంత్రాన్ని ఉపయోగించి ఆదాయాన్ని పొందుతున్న రైతు గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం.

తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఎక్కువ మొత్తంలో పండించే పంట వ‌రి. ఈ వ‌రిని కోసేందుకు వ‌రికోత మిష‌న్లు ఉండ‌గా ప్ర‌స్తుతం పొలంలో ఉండే వ‌రిగ‌డ్డిని క‌ట్ట‌లుగా క‌ట్టేందుకు కూడా మిష‌న్లు వ‌చ్చేశాయి. వ‌రిగ‌డ్డ క‌ట్ట‌లు క‌ట్టే మిష‌న్‌కు దాదాపు రూ. 3 లక్షల వ‌ర‌కు ఉంటుంది.

ఇక ఈ యంత్రాన్ని ట్రాక్టర్ కు ఏర్పాటు చేసుకుని ఉపయోగిస్తారు. ఇక ఈ మిషన్ ను ఎలా న‌డుపాల‌నే దానిపై పూర్తిగా శిక్ష‌ణ షోరూం వాళ్ళు ఇస్తారు. ఇక ఈ యంత్రానికి పెద్దగా రిపేరు ఖర్చులు కూడా ఉండ‌వు. ఇక యంత్రానికి కావాల్సింది ముందే ఉపయోగించిన ఆయిల్ , గడ్డి చుట్టేందుకు ఒక పురికోస.. 

165 -4
ఈ యంత్రం ఉపయోగించి వరి కట్టలు కట్టడం వలన రైతుల నుండి ఒక కట్టకు 30 రూపాయలు తీసుకుంటున్నారు. అయితే ఈ యంత్రం ఉపయోగించి గంటలో దాదాపు 60 కట్టలను కట్టేయవచ్చట. ఈ విధంగా సీజన్ లో రోజుకి ఈ యంత్రంతో దాదాపు 500 వరకు వరిగడ్డి కట్టలను కట్టవచ్చు. ఈ లెక్క ప్రకారం ప్రతిరోజు దాదాపు 15 వేల రూపాయలు ఆదాయం పొందవచ్చు.

వరి సాగు సీజన్ లో ఈ మిషన్ కు మరింత డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మరింత సంపాదించే అవకాశం ఉంది. అలాగే వరిగడ్డి కట్టలు కట్టే సీజన్  దాదాపు 2 నుంచి 3 నెలల వరకు ఉంటుంది కాబట్టి ఈ మూడు నెలల్లోనే మీరు భారీ మొత్తంలో ఆదాయాన్ని పొందవచ్చు.

ఈ విధంగా కాలానికి అనుగుణంగా మనం కూడా మారుతూ ఎన్నో రకాలుగా లబ్ధి పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా వ్యవసాయంపై ఆసక్తి ఉంటే ఈ విధంగా బిజినెస్ ను ప్రారంభించవచ్చు. లేదా వ్యవసాయ రంగంపై అవగాహన , ఆసక్తి ఉన్నవారికి దీనిని షేర్ చేయండి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?