Buisiness Idea : ఇద్దరు స్నేహితులు లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు.. ఎలాగో తెలుసా..?

Buisiness Idea : ఇద్దరు స్నేహితులు లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు.. ఎలాగో తెలుసా..?

Earning lakhs: మనం ఉన్న ప్రస్తుత కాలంలో నిజమైన స్నేహం జీవితం చివరి వరకు తోడుంటుంది.ఒంటరి లోను,ఓటమిలోనూ తోడై నడుస్తుంది.కన్నీరు తుడుస్తుంది.కష్టాల్లో ధైర్యం చెబుతుంది.అలాంటి స్నేహితుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిజినెస్ కోర్సు చదివారు. అందులో గల మెలకువలు నేర్చుకొని బిజినెస్ స్టార్ట్ చేశారు.

ఇప్పుడు మన ట్రెండ్స్ మచ్చ అనే పేరుతో తెలంగాణలో ఒక బ్రాండ్ గా మారింది. వీరు ఇద్దరూ ఎవరో కాదు సిద్దిపేటకు చెందిన అభిలాష్,సాయి తేజలు. వీళ్ళిద్దరికీ ఇంటర్ లొ స్నేహం కుదిరింది. వీళ్లు ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయం తెలంగాణలో ఒక బ్రాండ్ గా మారింది.అందరిలాగే వీళ్లు  కూడా ఇంటర్ పూర్తి చేశారు. ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీ లేదా బీటెక్ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకున్నారు.

కానీ వీరు ఇద్దరూ  కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు.అన్ని సంవత్సరాలు చదివే బదులు తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తొందరగా సెటిల్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.వీరిద్దరూ ఏదైనా డిఫరెంట్ కోర్సులు జాయిన్ అవ్వాలి అనుకున్నారు..వాటి గురించి చాలామందిని కనుక్కున్నారు. అంతేకాక  చాలామంది దగ్గర సజెషన్స్ కూడా తీసుకున్నారు.

వీరిద్దరూ కచ్చితంగా లైఫ్ లో సెటిల్ అవ్వాలనే నమ్మకంతో బిజినెస్ మేనేజ్మెంట్ అనే డిగ్రీ కోర్సులో జాయిన్ అయ్యారు.ఈ  కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఒక సంవత్సరంలో అందులో గల మెలకువలు నేర్చుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.అప్పుడే వారు ఏ బిజినెస్ అయితే బాగుంటుంది అని హైదరాబాద్ మొత్తం తిరిగారు.చివరికి ఎక్కడ మన లోకల్ క్లాత్ బ్రాండ్ స్టోర్స్ లేవని తెలుసుకున్నారు.అంతే ఆ ఒక్క ఆలోచనతో బిజినెస్ చెయ్యాలి అనుకున్నారు.

168 -1
ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి హై క్వాలిటీ కాక మరి లో క్వాలిటీ కాక మీడియం క్వాలిటీ తో తక్కువ రేట్ కి క్లాత్ ని అమ్మాలని నిర్ణయించుకున్నారు.దాంతో పాటు తప సొంత బ్రాండ్ ద్వారా ఈ క్లాత్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలని అనుకున్నారు.అయితే యూత్ ని ఆకర్షించే విధంగా ట్రెండ్ మచ్చ పేరుతో తమ క్లాత్ స్టోర్ ని మొదలుపెట్టారు.వీళ్లే వన్ బ్రాండింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్తున్నారు.

కానీ మధ్యలో అడ్వటైజ్మెంట్ లేక బిజినెస్ ఒక సంవత్సరం వరకు జరగలేదు. అప్పుడే వారిద్దరూ సోషల్ మీడియా మీద అవగాహన పెంచుకున్నారు. ప్రస్తుతం వారు సోషల్ మీడియా మార్కెట్ ను ఉపయోగించుకొని బిజినెస్ ఇంప్రూవ్  చేయాలని అనుకున్నారు.దీంతో వాళ్ళిద్దరూ ట్రెండ్స్ మచ్చ అనే పేరు తో ఇంస్టాగ్రామ్ పేజీని ప్రారంభించారు.ఈ ఇన్స్ స్టా పేజీలో వాళ్ళు క్వాలిటీని ప్రమోషన్ గా మార్చుకున్నారు..

168 -3
ఇంస్టాగ్రామ్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే వాళ్ళకి మంచి స్పందన వచ్చింది.వాళ్ల బ్రాండ్ కి వాల్యూ పెరగడంతో కష్టమర్స్ ఎక్కువగా వస్తున్నారు.చాలా తక్కువ రేట్ కి క్లాత్ ఇవ్వటం వల్ల కస్టమర్స్ రోజు వస్తున్నారు.దీంతో మన తెలంగాణలో ట్రెండ్స్ మచ్చ బిజినెస్ ముందుకు దూసుకుపోతుంది.ఇప్పుడు వారు ఐదు లక్షలతో టర్నోవర్ కి దగ్గరయ్యారు.

అంతటితో ఆగక మన ట్రెండ్స్ మచ్చ#2 పేరుతో సిద్దిపేటలో కూడా కొత్త బ్రాంచ్ మొదలుపెట్టారు. సిద్దిపేటలోనే కాక నలగొండ లో కూడా ఈ బ్రాంచ్ ను ఓపెన్ చేశారు. వాళ్లు ఇద్దరూ సోషల్ మీడియాని వాడుకుంటూ తమ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు.బీటెక్ చేసి సాఫ్ట్ వేర్ జాబ్ చేయాలనుకున్న వీరు బిజినెస్ కోర్సు చేసి బిజినెస్ లొ ఎంతో ఎత్తుకు ఎదిగారు.వారు అనుకున్నది సాధించారు.

అక్షయ గ్రాండ్ హోటల్ పక్కన మన ఫ్రెండ్స్ మచ్చ అనే పేరుతో బ్రాంచ్ ని మొదలు పెట్టారు.సిద్దిపేటలో మంచి రెస్పాన్స్ రావడంతో ఇతర జిల్లాల్లో కూడా బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నారు. మన ట్రెండ్స్ మచ్చ ఫౌండర్ అభిలాష్ రెడ్డి లోకల్ 18 ప్రతినిధి కేశవ ప్రవీణ్ తో మాట్లాడారు. క్వాలిటీ బాగుండటం వల్లే మాకు కస్టమర్లు వస్తున్నారు.

మా బ్రాండ్ కు వ్యాల్యూ పెరిగింది. మేము ఇంకా సాధిస్తాం. విదేశీ బ్రాండ్ ని ప్రోత్సహించినట్లుగా మన లోకల్ బ్రాండ్ ను ఎందుకు ప్రోత్సహించకూడదు అనేది మా నినాదం. అందుకే మంచి క్వాలిటీతో తక్కువ ధరలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మన  ట్రెండ్స్ మచ్చ స్టోర్ ని అందరూ ఆదరించాలని కోరుతున్నాను..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?