Business of dhoop sticks and agarbattis : ఇంట్లో కూర్చుని వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసం..
కానీ ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలి..? ఎంత పెట్టుబడి ఖర్చు అవుతుందనే ఆలోచనతో చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే మరోవైపు వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారి కోసమే ఇటీవల మేము ఒక బిజినెస్ ఐడియాను తీసుకువచ్చాం.
అంతేకాక ప్రస్తుత కాలంలో అగర్బత్తులతో పాటు ధూప్ స్టిక్స్ ను ఉపయోగించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ వస్తుంది. మరి మార్కెట్లో పెరుగుతున్న ఈ డిమాండ్ ను మనం వ్యాపారంగా మలుచుకున్నట్లైతే మంచి లాభాలను పొందవచ్చు.
మరి ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి..?ఎంత పెట్టుబడి ఖర్చు అవుతుంది..?లాభాలు ఎలా ఉంటాయి.? ఈ వ్యాపారానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎలా ప్రారంభించాలంటే...
మీరు ఈ వ్యాపారాన్ని మీ ఇంట్లోనే ఓ చిన్న గదిలో కూడా ప్రారంభించవచ్చు. అయితే ఈ ధూప్ స్టిక్స్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుగా మనకు ధూప్ స్టిక్స్ ను తయారు చేసే మిషన్ కావాల్సి ఉంటుంది. ఇలాంటి మిషన్స్ మనకు ప్రస్తుతం మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి.
మీరు ఈ మిషన్స్ ను కొనుగోలు చేసినప్పుడు వాటితో పాటు ధూప్ స్టిక్స్ తయారీకు కావాల్సిన ముడి సరుకులు కూడా కంపెనీ వారు అందిస్తారు. కావున ముడి సరుకుల ఖర్చు మీకు ఇక్కడ తగ్గుతుంది. ఇక కంపెనీ వారు అందించి పొడిలో వాటర్ ను కలుపుకొని మిషన్ లో వేసినట్లయితే ధూప్ స్టిక్స్ తయారవుతాయి.
ఆ విధంగా మిషన్ లో ఒక్కసారి 25 ధూప్ స్టిక్స్ రెడీ అవుతాయి. ఇక వీటిని ఒక రోజంతా ఎండలో ఉంచిన తర్వాత ప్యాక్ చేసి విక్రయించవచ్చు. అయితే ఇక్కడ మీరు తయారు చేసిన ధూప్ స్టిక్స్ మార్కెటింగ్ చేయడం చాలా ముఖ్యం. మీ బిజినెస్ అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా మార్కెటింగ్ స్కిల్స్ తెలిసి ఉండాలి. అప్పుడే ఈ వ్యాపారంలో మీరు మంచి లాభాలను పొందుతారు.
పెట్టుబడి ఎంత...
ఇక పెట్టుబడి విషయానికి వచ్చినట్లయితే...ధూప్ సిక్స్ తయారీ మిషన్ ప్రస్తుతం మార్కెట్లో రూ.10,000 కు అందుబాటులో ఉంది. అలాగే ధూప్ స్టిక్స్ తయారీకి కావాల్సిన ముడిసరుకు రూ.250 నుండి మొదలవుతుంది. ఇక ఈ ధూప్ స్టిక్స్ తయారీ మిషన్ ద్వారా సుమారు నిమిషానికి 60 ధూప్ స్టిక్స్ ను మనం తయారు చేసుకోవచ్చు.
అలాగే ప్యాకింగ్ చేయడానికి కొంత ఖర్చు అవుతుంది. ఈ విధంగా దాదాపు 15 వేల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని మీరు మొదలు పెట్టవచ్చు. ఇక ఈ వ్యాపారంలో తక్కువలో తక్కువగా మంచి మార్కెటింగ్ చేస్తే నెలకు రూ.30,000 వరకు సంపాదించవచ్చు.