cause of diabetes : ఓ పరిశోధనలో బయటపడ్డ ఆసక్తికర విషయాలు... షుగర్ వ్యాధికి కారణం ఇదే...
తీసుకునే ఆహారం నుంచి మారిన జీవన విధానం కుటుంబంలో ఇతరులకి ఈ వ్యాధి ఉండడం వల్ల ఇలా ఎన్నో కారణాలకు డయాబెటిస్ ముఖ్య కారణం అవుతుందని నిపుణులు చెప్తున్నారు.. అయితే ప్రస్తుతం ఓ పరిశోధనలో దీనికి మరొక కారణాన్ని కనిపెట్టారు. టైప్ -2 డయాబెటిస్లకు బద్ధకంతో పాటు జీవన విధానం, పిండి పదార్థాలు అధికంగా తీసుకోవడం కాకుండా స్మోకింగ్ కూడా ఓ కారణం అని ఈ పరిశోధనలో బయటపడింది.
అంటే పొగాకు సంబంధించిన ఉత్పత్తులు వినియోగించడం వలన ఈ సమస్య వస్తుందని చెప్తున్నారు.. ప్రధానంగా తల్లి కడుపులో ఉండగా పొగాకు ప్రవానికి గురైన వారికి బాల్యంలో లేదా యుక్త వయసులో సిగరెట్లు తాగడం మొదలుపెట్టిన వారికి పెద్దయ్యాక మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలు బయటపడింది.
అయితే ప్రారంభంలో పొగాకు ప్రభావానికి గురైన తర్వాత సరియైన జీవన పాటించిన వారిలో మధుమేహం ముప్పు గణనీయంగా తగ్గినట్లు ఈ రీఛార్చ్ లో తేలింది. స్మోకింగ్ చేసే వారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం 30 నుంచి 40% అధికంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. చైనా కు చెందిన శాంజై జియాగో టంగ్ యూనివర్సిటీ స్కూల్ ఆపు మెడిసిన్ పరిశోధకులు చేసిన ఆధ్యాయంలో ఈ విషయాలు బయటపడ్డాయి.

దీనికోసం మీరు బ్రిటన్ బయో బ్యాంకులో ఉన్న 4.76 లక్షల మంది ఆరోగ్య సమాచారాన్ని సేకరించి చెప్పారు. ఈ స్మోకింగ్ అలవాటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండడం మంచిది.. లేదా అసలు ఆ అలవాటు మానుకోవడమే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. షుగర్ వ్యాధి ఇప్పుడు లేకపోయినా ముందు వచ్చే అవకాశాలు ఉంటాయి. కావున ఈ పొగాకుకు బానిసలా మారకుండా ఈ అలవాటును మానుకోవడం మంచిది..
ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఉదయం లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాము కూడా తప్పకుండా శ్రద్ధ పెట్టాల్సిన విషయం. మీరు తినే ఆహారంలో ఎక్కువ ఫైబర్ ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. ఈ విధంగా చేస్తే డయాబెటిస్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
