Ganuga oil : ఈ వ్యాపారంతో లక్షల్లో సంపాదన.. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం..
ఈ నేపథ్యంలోనే వంటలో ఎక్కువగా ఉపయోగించే నూనె రిఫైండ్ ఆయిల్ కాకుండా సహజ సిద్ధంగా తయారు చేస్తూనటువంటి నూనెల పై నేటి సమాజంలో అవగాహన పెరుగుతోంది. దీంతో ఈ నూనె ఖరీదు ఎక్కువైనా సరే ఆరోగ్యం కోసం గానుగ నూనెల వైపుప్రజలు మొగ్గుచూపుతున్నారు.
ఆధునిక కాలంలో భాగంగా ప్రస్తుతం ప్రతి వస్తువు కూడా కల్తీమయం అవుతుంది. మరి ముఖ్యంగా మన వంటింట్లో ఉపయోగించే నూనెలో విపరీతమైన కల్తీ జరుగుతుంది. నూనె ఎక్కువ రోజులు మన్నిక ఉండేందుకు కొన్ని రకాల రసాయనాలు కలపడంతో నేటి కాలంలో ప్రతి ఒక్కరికి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పాలి.
ఈ నేపథ్యంలోనే ప్రజలకు నాణ్యమైన మరియు ఆరోగ్యానికి మేలు చేసేటువంటి సహజ సిద్ధమైన మంచి నూనెను అందించాలనే లక్ష్యంతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. గానుగ ద్వారా నూనె తీసే పరిశ్రమను ఏర్పాటు చేస్తే ఇక పరిశ్రమ వద్దకే వినియోగదారులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తమ కళ్ల ముందే తయారు అవుతున్న నూనెను కొనుగోలు చేసేందుకు ఎగబడుతుంటారు.
ఇక గానుగ నూనె పరిశ్రమలో పల్లీలు, కొబ్బరి ,ఆవాలు, నువ్వులు , , పొద్దు తిరుగుడు పువ్వు గింజలు , ఇంకా అనేక రకాల నూనె గింజలు అందుబాటులో ఉంటాయి. లేదా వినియోగదారులు తీసుకువచ్చిన సరే నూనె పట్టించే అవకాశం కూడా ఉంది. అంతేకాదు వినియోగదారుల కళ్ళముందే నూనె సహజ సిద్ధంగా తీసి ఇస్తుండడంతో ఆ ప్రాంత సమీపంలో ఉన్న ప్రజలకు గానుగ నూనెపై ఆసక్తి పెరుగుతోంది.
దీంతో ఈ బిజినెస్ మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే గానుగ పట్టి తీసిన పల్లీల నూనె యొక్క ధర లీటర్ 360 ఉండగా, నువ్వుల నూనె ధర 510 , పొద్దుతిరుగుడు పువ్వుల నూనె ధర 450 వరకూ అమ్ముతున్నారు. అయితే ఈ గానుగ ద్వారా నూనె తీయడం వలన నూనె అత్యంత రుచికరంగా ఉండటమే కాకుండా అత్యధిక పోషకాలను కలిగి ఉంటుంది.
దీంతో మీ ఆరోగ్యం కూడా భద్రంగా ఉన్నట్లే. మరి ఈ అవకాశాన్ని మనం బిజినెస్ గా మలుచుకున్నట్లయితే ఇంటి దగ్గరే కూర్చుని లక్షల్లో సంపాదించవచ్చు. ఇక ఈ బిజినెస్ కోసం మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి చాలా సులువుగానే ప్రారంభించవచ్చు.
ప్రస్తుతం మార్కెట్ లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉండడం వలన ఈ బిజినెస్ కచ్చితంగా సక్సెస్ అవుతుంది. కావున మీరు కేవలం మార్కెటింగ్ చేసుకోగలిగితే సరిపోతుంది. అలాగే ఈ పరిశ్రమ ప్రారంభించాలి అనుకునేవారు ముందుగా అలాంటి పరిశ్రమలను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకొని ప్రారంభించడం మంచిది.