Gold prices : బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త...రెండు తెలుగు రాష్ట్రాలలో తగ్గనున్న ధరలు...
అయితే కొన్ని సందర్భాలలో ధరలు పెరిగితే మరికొన్ని సందర్భాలలో ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే వాస్తవానికి భారతీయ మహిళలందరూ కూడా ఆభరణ ప్రియులు. ఎలాంటి శుభకార్యానికైనా సరే దానికి తగ్గట్టు బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. అందుకే ప్రస్తుతం బంగారం ధరలపై ఎక్కువ మొత్తంలో దృష్టి సారిస్తుంటారు.

ఈ క్రమంలోనే బంగారం మరియు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.62,750 ఉండగా...24 క్యారెట్ల బంగారం ధర రూ.68,450 గా ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే ఒక కేజీ రూ.78,000 ఉంది. ఇక ముఖ్యమైన నగరాలలో బంగారం ధర విషయానికొస్తే...
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.62,900 ఉండగా...24 క్యారెట్ల ధర రూ.68,600 గా ఉంది. ముంబై మహానగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.62,750 గా ఉండగా... 24 క్యారెట్ల బంగారం ధర రూ.68,450 గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.69490 గా ఉంది.

ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.62750 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.68,450 గా ఉంది. అదేవిధంగా హైదరాబాద్, వైజాగ్ ,విజయవాడ వంటి తెలుగు మహానగరాలలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.62,750 గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.68,450 గా ఉంది.
వెండి ధరలు...
ఇక వెండి ధరల విషయానికి వస్తే ఢిల్లీలోకి ఒక కేజీ వెండి ధర రూ.78,000 ఉండగా.. కూడా కిలో వెండి ధర రూ.78,000 ఉంది. ఇక బెంగళూరులో కేజీ రూ.77,000 ఉండగా చెన్నైలో మరియు కేరళలో రూ.81,000... హైదరాబాద్, వైజాగ్ , విజయవాడ నగరాలలో రూ.81,000 గా ఉంది.
