Govt Jobs: ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం కావాలని ఎందుకు కోరుకుంటారో తెలుసా..?.. ఇవీ బెనిఫిట్స్
ప్రభుత్వ ఉద్యోగం వల్ల చాలానే లాభాలు అనేవి ఉంటాయి. పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది, రిటైర్లు అయ్యాక ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ లాగా ప్రతినెల ఎంతోకొంత డబ్బు అనేది ఎకౌంట్లో పడుతుంది. అలాగే అధిక శాలరీలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగం వైపు మొగ్గు చూపుతున్నారు.
ఐఏఎస్ మరియు ఐపీఎస్
అయితే ఇప్పుడు మనం చెప్పబోయే ఈ ప్రభుత్వ ఉద్యోగానికి మొదటి నెల ఏకంగా 56,000 రూపాయల నుండి ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా వీళ్ళు అనుభవం పెరిగేకొంది ఈ ఉద్యోగ శాలరీ అనేది దాదాపుగా రెండు లక్షల వరకు పెరగవచ్చు. ప్రస్తుతం ఈ ఉద్యోగాలు పొందాలంటే అంత ఆశ మాస కాదు. ఈ ఉద్యోగం పొందాలంటే మీరు కచ్చితంగా యుపిఎస్సి నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ పాసవుతేనే ని ఉద్యోగానికి అర్హత పొందుతారు. అంతేకాకుండా కష్టతరమైన ఇంటర్వ్యూలు ఎగ్జామ్స్ అనేవి ఉండడం వల్ల చాలా తక్కువ మంది మాత్రమే ఈ ఉద్యోగాలను పొందుతారు.
NDA డిఫెన్స్ మరియు సర్వీసెస్
ఈ ఎన్ డి ఏ డిఫెన్స్ మరియు సర్వీసెస్ అనేవి మన భారతదేశానికి సంబంధించిన సైన్యానికి అలాగే నేవీ మరియు వైమానిక భద్రత విషయంలో మన భారతదేశం ను ముందుండి నడిపిస్తారు. ఈ ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే సైన్యం, నేవీ, వైమానిక దళం వంటి అధికారులుగా చేయిస్తారు. వీళ్ళకి మొదటి నెల దాదాపుగా 60,000 రూపాయల దాకా శాలరీ అనేది ఇస్తారు. ఇక అనుభవం పెరిగే కొద్ది దాదాపు రెండు లక్షల వరకు ఇలా జీతాన్ని పెంచుతూ ఉంటారు.
IFS ఆఫీసర్లు
ఈ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లను వాళ్ళు ఫారన్ దేశాల్లో మన ఇండియా గొప్పతనాన్ని తెలియజేయాల్సినటువంటి పని అనేది ఉంటుంది. ఈ ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఉద్యోగంలో చేరిన వారు ఫారిన్ దేశాల్లో మనం ఇండియా గురించి గొప్పగా ప్రజెంటేషన్ ఇస్తారు. వీళ్లకు కూడా ఎక్కువగా మొదటి నెల దాదాపు 60000 రూపాయలకు పైగా జీతమనేది ఇస్తారు. ఇక అనుభవం పెరిగే కొద్ది లక్ష 50 వేల నుండి రెండు లక్షల వరకు కూడా ఇస్తారు. వీళ్లు కూడా యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు పాస్ అవ్వాల్సి ఉంటుంది.
ISRO, DRDO శాస్త్రవేత్తలు
ఇస్రో అనగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ . ఇందులో పని చేసిన ఉంటదికారులు ఎక్కువగా రాకెట్లను లేదా ఉపగ్రహాలనేవి తయారు చేస్తూ ఉంటారు. అలా తయారు చేసిన వాటిని అంతరిక్షంలోకి ఎలా పంపించాలనే దానిమీద వర్క్ అనేది చేస్తారు. ఇక వీళ్లకు కూడా ఎక్కువగా జీతాలు అనేవి ఉంటాయి. వీళ్ళకి మొదటి నెల ప్రారంభంలోనే 70000 రూపాయల దాకా జీతం అనేది ఇస్తారు. కాబట్టి ఇది భారతదేశంలోనే అత్యధిక జీతాలుకుందేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలలో ఒకటి.
IIT లెక్చరర్స్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ ఐఐటి సంస్థల్లో ఎక్కువగా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్స్ గా పనిచేసే వీళ్ళకి ఎక్కువ మొత్తంలో గౌరవం అనేది లభిస్తుంది. వీళ్ళకి ఈ ప్రారంభంలోనే నెలకు ఏకంగా లక్ష రూపాయలు వరకు శాలరీలు అనేవి ఇస్తారు. ఇక అనుభవం పెరిగే కొద్దీ రెండు లక్షలు ఇస్తారు. పీహెచ్డీ పూర్తి చేసిన వాళ్లకు మాత్రమే ఈ ఐఐటీలో లెక్చరర్ గా లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గా ఈ ప్రభుత్వ ఉద్యోగం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి.