Online Shoping Fraud : ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే అస్సలు చేయరు...
తరువాత దాని ద్వారా లావాదేవీలు జరుపుకోవాలి.ఈ ఫ్లాట్ ఫాం లో ఎన్నో రకాల డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ లు అందిస్తారు. వివిధ రకాల ఉత్పత్తులపై తగ్గింపు మరియు రివార్డులను కూడా అందిస్తారు. కానీ వాటిలో కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి అని ఇటీవల సర్వేలో తేలింది..
సెంట్రల్ కన్స్యూమర్ ప్రొడక్షన్ అథారిటీ 13 రకాల తప్పుదారులను పట్టించే ప్రకటనలు కొనుగోలుదారుల హక్కులను ఉల్లంఘించె అన్యాయమైన వాణిజ్య పద్ధతులను తెలిపింది వాటిలో హిడేన్ ఛార్జీలు, ఫాల్స్ అర్జెన్సీ, బాస్కెట్ స్నీకింగ్, సబ్ స్క్రిప్షన్ క్యాష్ బ్యాక్ లు, కన్ఫర్మ్ షేమింగ్, ఫోర్స్డ యాక్షన్, సబ్ స్క్రిప్షన్ ట్రాప్, ఇంటర్ పేస్ ఇంటర్ పరెన్స్, డ్రీప్ ప్రెపింగ్, టిక్ ప్రశ్నలు ఇతర విధానాలు కూడా ఉన్నట్లుగా తేలింది.వీటి ద్వారానే పలువురు కొనుగోలుదారులు మోసపోతున్నట్లుగా తెలిపింది..
ప్రస్తుతం నిర్వహించిన సర్వేలో దీనికి సంబంధించిన ప్రకారం దాదాపుగా 45 వేల మంది తన అభిప్రాయాలను తెలిపారు. హిడెన్ చార్జీల కు సంబంధించిన 52 శాతం మంది ఈ సమస్యలను ఎదుర్కొన్నారు. మరో 67% మంది సబ్ స్క్రిప్షన్ ట్రాప్ లో పడ్డారు.మోసపూరిత బైట్ అండ్ స్విచ్ సమస్యలను కూడా దాదాపుగా 62 శాతం మంది ఎదుర్కోనారు.
దీనిలో కొనుగోలుదారులు ఎక్కువ చెల్లింపులు చేయటం కోసం ఎక్కువగా క్యాష్ బ్యాక్ లు అందిస్తుంటారు.కానీ ప్రోత్సాహం ఎప్పుడు కూడా చెల్లించరు. భారత ప్రభుత్వం 2023 డిసెంబర్ లో కొనుగోలుదారుల మోసం చేసే ఈ పద్ధతులు చట్ట విరుద్ధం అని తెలిపింది.
ఈ చీకటి పద్ధతుల వలన కస్టమర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించే ఆన్ లైన్ పేమెంట్ ఫ్లాట్ ఫాం పై రూ.10 లక్షలు జరిమానా విధిస్తున్నట్లుగా ప్రభుత్వం హెచ్చరించింది..