Jeff Bezos : 12 మిలియన్ల షేర్లను విక్ర‌యించిన జెఫ్ బెజోస్ 

Jeff Bezos : 12 మిలియన్ల షేర్లను విక్ర‌యించిన జెఫ్ బెజోస్ 

Jeff Bezos : ఈ-కామర్స్ దిగ్గ‌జం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంస్థలో త‌న‌ 12 మిలియన్ల షేర్లను గత బుధ, గురువారాల్లో విక్రయించారు. వాటి విలువ సుమారు 200 కోట్ల డాలర్ల పై చిలుకు అంటే  దాదాపు రూ.16 వేల కోట్ల సంప‌ద‌ను విక్ర‌యించారు. అమెజాన్‌ సంస్థ సీఈఓగా వైదొలిగిన తర్వాత 2021 నుంచి జెఫ్ బెజోస్ తన షేర్లను విక్రయించడం ఇదే మొదటిసారి కావ‌డం గ‌మ‌నార్హం. రాబోయే 12 నెలల్లో అమెజాన్ సంస్థలో 50 మిలియన్ల షేర్లను విక్రయిస్తానని ఈ నెల రెండో తేదీన జెఫ్ బెజోస్ ప్రకటించారు. ఒక్కో షేర్ 168-171 డాలర్ల విలువకు విక్రయించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ లో ఆయన  పేర్కొన్న విష‌యం తెలిసిందే.

2002 నుంచి అమెజాన్ వ్యవస్థాపకుడిగా ఉన్న‌ జెఫ్ బెజోస్ దాదాపు 30 బిలియన్ డాలర్లకు పైగా విక్రయించాడు. 2020-2021ల్లోనే సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించడం గ‌మ‌నార్హం. గత నవంబర్ నెలలో స్వచ్ఛంద సంస్థలకు దాదాపు 230 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను గిఫ్టులుగా పంపిణీ చేయ‌డం జ‌రిగింది. గత 12 నెలల్లో అమెజాన్ షేర్ 78 శాతం పెరిగింది. గ‌త ఏడాది ఫిబ్రవరి నాటికి జెఫ్ బెజోస్ కు అమెజాన్‌ సంస్థలో 12.3 శాతం వాటా ఉంది. ఆయన తన ప్రణాళికలో భాగంగా 50 మిలియన్ల షేర్లు విక్రయించినా ఆయన వద్ద 11.8 శాతం వాటా ఉంటుందని అంచ‌నా వేస్తున్నారు.

వ‌ర‌ల్డ్‌ బిలియనీర్ల లిస్టులో జెఫ్ బెజోస్ మూడో స్థానంలో నిలిచారు. ఆయన త‌న‌ వ్యక్తిగత సంపద 195.5 బిలియన్ డాలర్లు, లగ్జరీ వస్తువుల తయారీ సంస్థ అయిన ఎల్వీఎంహెచ్ సీఈఓ బెర్నాల్ట్ అర్నాల్ట్, టెస్లా-ట్విట్టర్-స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విష‌యం విదిత‌మే..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?