OLED Vs QLED : క్యూఎల్ఈడీ , ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీల్లో ఏది బెస్ట్..
అయితే ఎల్ఈడీ టీవీలో ఎక్కువగా కనిపించేవి రెండు రకాలు.క్యూఎల్ఈడీ ,ఓఎల్ఈడీ టివి గురించి వినే ఉంటారు.కానీ వీటి అర్థం ఏమిటి,వీటిలో ప్రత్యేకతలు ఏమిటి, తేడాలు ఏంటి అనే విషయలు పెద్దగా ఎవరికి తెలియదు. ఒకవేళ మీరు గనక ఒక మంచి టాప్ బ్రాండ్ స్మార్ట్ టీవీ ని కొనాలి అనుకున్నట్లయితే కంపల్సరిగా క్యూఎల్ఈడీ ,ఓఎల్ఈడీ గురించి మీరు తెలుసుకోవాలి. అందుకే మీకోసం వాటికి సంబంధించిన వివరాలు మీకు అందిస్తున్నాం.

క్యూఎల్ఈడీ గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో రిలీజ్ అయిన హెయ్ అండ్ సామ్సంగ్ టీవీలలో ఏది చూసినా ఆ టీవీ చివరన క్యూ ఎల్ఈడీ లేబుల్ ఉంటుంది. సామ్సంగ్ చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే క్యూ ఎల్ఈడీ అనగా క్వాంటం డాట్ ఎల్ఈడీ టీవీ అనగా ఎల్ఈడీ, ఎల్సిడి టీవీల తరువాత క్రమంలో లేటెస్ట్ అడ్వాన్స్ మెంట్ గా ఈ క్యూ ఎల్ఈడీ టీవీలు మార్కెట్లోకి వచ్చాయి.పాత ఎల్ఈడీ, ఎల్ సిడీ టీవీ లకు క్వాంటం డాట్ ఫిల్మ్ ను అందిస్తుంది.
ఎల్ఈడీ బ్యాక్ లైట్ సిస్టమ్ ఉన్నట్లు ఈ ఓఎల్ఈడీ లలో ఎడిటింగ్ సాంకేతికతతో ఉంటాయి.ఏమిటింగ్ అనగా డిస్ప్లే లోని పిక్సెల్ ఒక్కొక్కటి తన సొంత కాంతిని రిలీజ్ చేస్తుంది. ఇది వారికి వ్యక్తిగత బ్రైట్ నేస్,కాంట్రాస్ట్ కలిగి ఉంది. ఇవి డార్క్ థీమ్ ని ఎక్కువ ప్రకాశవంతంగా చూపిస్తుంది..
ఓఎల్ఈడీ డిస్ ప్లే మెరుగైన కాంట్రాస్ట్ స్థాయిని అందిస్తుంది. ఇది ఒక చలనచిత్రం లేక టెలివిజన్ షో లోని ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా ఉత్తమంగా ప్రకాశించేలా చేస్తూ ఎక్కువ నాణ్యత కలిగి ఉన్న చిత్రాన్ని ఇస్తుంది. అనగా ఓఎల్ఈడీ టీవీలో అద్భుతమైన హెచ్ డి ఆర్ నాణ్యతను కూడా మీరు పొందుతారు. అయితే ఇవి వ్యక్తిగత లైటింగ్ పై ఆధారపడినందుకు, అవి మీ టాప్ ఆఫ్ ది లైన్ క్యూ ఎల్ఈడీ డిస్ ప్లే ల కన్నా కొంచెం మసకగా ఉంటుంది.
ఇవి ఎక్కువ ప్రకాశాన్ని కలిగి ఉంటుంది.మీ టీవీ గదులు చీకటిగా ఉన్నట్లయితే కిటికీలు, బ్లాక్ అవుట్ కార్టెన్లు ఉన్న గదులల్లో ఓఎల్ఈడీ టీవీ చాలా బాగుంటుంది. గదులలో వెలుతురు బాగా ఉండి ప్రకాశవంతంగా ఉన్నట్లయితే అక్కడ ఈ టీవీలు స్పష్టంగా కనిపిచవు.ఓఎల్ఈడీ లు 24/7 న్యూస్ కాస్ట్ లను రన్ చేయకపోవడం చాలా మంచిది. క్యూఎల్ఈడీ టీవీలు లైటింగ్ ఎక్కువగా ఉన్నట్లయితే గదులకు సరిగ్గా సరిపోతుంది.
ఎందుకు అనగా 65 అంగుళాల హిసెన్స్ యూ 8 లాంటి కొన్ని మోడల్ లు 2,000 నీట్ ల ప్రకాశ స్థాయిని చేరుకుంటుంది. అయితే ఇదే కొన్ని సమయాలలో ప్రతికూలతగా కూడా మారుతుంది. ఇది మీ టెలివిజన్ లో మీరు ఏ రకమైన నాణ్యతను వెతుక్కోవాలి అనుకుంటున్నారో దానిపైన ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుత ఓఎల్ఈడీ డిస్ ప్లే లు ప్రతి పిక్సెల్ నుండి వచ్చే వ్యక్తిగత లైటింగ్, మెరుగైన కాంట్రస్ట్, బ్లాక్ స్థాయిని అందిస్తుంది. క్యూఎల్ఈడీ డిస్ ప్లే లు ఎప్పుడు ప్రకాశవంతంగానే ఉంటాయి. ఓఎల్ఈడీ మోడల్ కన్నా కూడా ఇవి ప్రకాశవంతంగా ఉన్నాయి..