RBI 2000 notes : బీ అలర్ట్... 2000 నోట్లపై కీలక అప్డేట్...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోటుపై ఒక కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు రద్దు చేయబడిన 2000 కరెన్సీ నోటు మార్పు పై అత్యవసర అప్డేట్ RBI ఇచ్చింది.ఏప్రిల్ 1వ తేదీ 2000 నోట్లు మార్పిడి సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా ప్రకటించింది. తమ 19 కార్యాలయాల్లో కూడా ఈ సేవలు నిలిపివేసినట్లుగా ప్రకటించింది. పాత ఆర్థిక సంవత్సరం ముగిసి, కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో అకౌంట్స్ బిజీ వర్క్ దృశ్య ఈ నిర్ణయాలు తీసుకున్నారు..

మళ్లీ ఏప్రిల్ 2 నుండి 2000 నోట్లు మార్పిడి యధావిధిగా జరుగుతుంది.పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత ద్రవ్యలభ్యతను పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్లో ను ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే. దాని తర్వాత పోయిన సంవత్సరం వీటిని కూడా చాలామనీ నుండి RBI ఉపసంహరించింది. 2023 మే 19న ఈ ప్రకటన వెలువడింది.నోట్లను డిపాజిట్ చేసేందుకు లేక బ్యాంకులో మార్చటానికి 2023 సెప్టెంబర్ 30వ తారీకు వరకు చివరి గడువు ఇచ్చింది.
అయితే రూ.2,000 బ్యాంకు నోట్లు ఇప్పటికీ లీగల్ టెండర్ గా కొనసాగుతున్నాయని తెలిపింది. వీటిని మొత్తం మూడు మార్గాలలో మార్చుకోవచ్చు అని తెలిపింది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. రూ.2,000 బ్యాంకు నోట్లు చలామణి నుండి ఉపసంహరించిటప్పటి నుండి అవి లీగర్ టెండర్ గా కొనసాగుతూనే ఉన్నాయి. మీ దగ్గర గనక రూ.2000 నోట్లు ఉన్నట్లయితే, వాటిని వెంటనే RBI ఆఫీసులో డిపాజిట్ చేయాలి..
దేశవ్యాప్తంగా ఉన్న 19 RBI ఆఫీస్ లో ఈ సౌకర్యం ఉన్నది. అక్టోబర్ 8, 2023 తర్వాత 2000 నోట్లను బ్యాంకుల్లో ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం RBI తొలగించింది. దీని తర్వాత నోట్ల మార్పిడికి బదులుగా RBI ఆఫీస్ లో వీటిని డిపాజిట్ చేసి ఆ మొత్తాన్ని కూడా తమ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేసే అవకాశం తీసుకొచ్చింది. దేశంలో 19 ప్రధాన నగరాలలో ఆర్బిఐ రీజనల్ ఆఫీసులో ఉన్నాయి. బేలాపూర్, అహ్మదాబాద్,బెంగళూరు, బోపాల్, భువనేశ్వర్,చెన్నై, చండీగఢ్, గౌహతి, హైదరాబాద్,జమ్మూ,జైపూర్, కాన్పూర్,లక్నో,ముంబై,కోల్ కత్త,నాగపూర్, తిరువనంతపురంలోని RBI కార్యాలయంలో బ్యాంకు నోట్లను డిపాజిట్ ఎక్సేంజ్ చేయవచ్చు..