Self Business Ideas : ఇంట్లోనే చిన్న రూమ్‌లో కుంకుమ పువ్వు పెంచుతూ నెలకు రూ.3.5 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఎలా సాధ్యమైందంటే?
అసలు మన దేశంలో కశ్మీర్ లో తప్పితే మరెక్కడా కుంకుమ పువ్వు సాగు కనిపించదు. ఎందుకంటే.. కుంకుమ పువ్వు చెట్లు పెరగడానికి కావాల్సిన వాతావరణం అక్కడే దొరుకుతుంది. కానీ.. కశ్మీర్ లో పండే కుంకుమ పువ్వును ఓ వ్యక్తి ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో పండిస్తున్నాడు. పండించడమే కాదు.. లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
అక్కడ అత్యాధునికమైన పద్ధతుల్లో ఎలా వ్యవసాయం చేస్తున్నారో చూసి నేర్చుకున్నారు. అలాగే.. పలు పంటల సాగు కోసం వాళ్లు వాడే టెక్నాలజీని చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత మన ఇండియాకు 70 శాతం కుంకుమ పువ్వు ఇరాన్ నుంచి దిగుమతి అవుతుందని తెలుసుకున్నారు. దానికి కారణం.. మన దగ్గర కేవలం కశ్మీర్ లో మాత్రమే కుంకుమ పువ్వు పండుతుంది.

Self Business Ideas : తన రిటైర్ మెంట్ తర్వాత కుంకుమ పువ్వు సాగు ప్రారంభించిన రమేశ్
తన రిటైర్ మెంట్ అయిపోగానే తన ఇంట్లోనే కుంకుమ పువ్వు సాగు ప్రారంభించారు రమేశ్. 2017 లో నోయిడాలోని సెక్టార్ 63లో ఉండే తన ఇంట్లో చిన్న గదిలో కుంకుమ పువ్వు సాగు స్టార్ట్ చేశారు. కుంకుమ పువ్వు సాగు కోసం ఆ రూమ్ కి కావాల్సిన వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించారు. దాని కోసం 4 లక్షలు ఖర్చు పెట్టారు.
ఆ తర్వాత మరో 2 లక్షలు ఖర్చు పెట్టి కశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు గింజలు తెచ్చి వాటి సాగు ప్రారంభించారు. కుంకుమ పువ్వు సాగు అనేది ఒకసారి చేస్తే చాలు. అంటే.. ఒకసారి పెట్టుబడి అంతే. ఆ తర్వాత కేవలం కరెంట్ బిల్, కూలీ డబ్బులు తప్పితే పెద్దగా ఈ సాగు వల్ల ఖర్చు ఉండదు అంటున్నారు రమేశ్. తనకు ఇప్పుడు ఈ సాగు వల్ల సంవత్సరానికి రూ.8 వేల వరకు మాత్రమే ఖర్చు వస్తోందన్నారు.
కానీ.. హోల్ సేల్ మార్కెట్ లో తను ఒక్క కేజీ కుంకుమ పువ్వు అమ్మితే రూ.2.5 లక్షలు వస్తోంది. రిటైల్ మార్కెట్ లో అయితే కుంకుమ పువ్వు ధర కిలోకు రూ.3.5 లక్షలు వరకు పలుకుతోంది. ఒకవేళ కుంకుమ పువ్వును విదేశాలకు ఎగుమతి చేస్తే కిలో కుంకుమ పువ్వుకు రూ.6 లక్షల వరకు సంపాదించవచ్చని చెబుతున్నారు రమేశ్.
ప్రస్తుతం రమేశ్ కూడా ఇంట్లో కూర్చొని నెలకు రూ.3.5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడు. 65 ఏళ్ల వయసులో ఇంట్లో కూర్చొని నెలకు రూ.3.5 లక్షలు సంపాదించడం అనేది ఒకవిధంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఒక్కసారి మాత్రమే పెట్టుబడి.. ఇప్పుడు కేవలం సంవత్సరానికి కొంత ఖర్చులు భరించాలి అంతే.. ప్రతి నెల రూ.3.5 లక్షల ఆదాయం మాత్రం ఎటు వెళ్లదు.
రమేశ్ చేస్తున్న కుంకుమ పువ్వు సాగు గురించి నోయిడాలో తెలుసుకున్న వాళ్లు.. తాము కూడా ఈ సాగు చేస్తామని ముందుకు రావడంతో ఆకర్షక్ శాఫ్రాన్ ఇనిస్టిట్యూట్ పేరుతో నోయిడాలో ఓ సంస్థను ఏర్పాటు చేశారు రమేశ్. ఆ ఇనిస్టిట్యూట్ ద్వారా కుంకుమ పువ్వు సాగు ఎలా చేయాలో ట్రెయినింగ్ ఇస్తుంటారు రమేశ్.