రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన మెటా.. పొలిటికల్ కంటెంట్ పై సంచలన ప్రకటన

రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన మెటా.. పొలిటికల్ కంటెంట్ పై సంచలన ప్రకటన

ప్ర‌స్తుతం సోషల్ మీడియా వినియోగం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు సోషల్ మీడియాను తెగ వినియోగించుకుంటారు. తమ భావాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి సోషల్ మీడియాను ముఖ్య వేదికగా ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా దిగ్గజం మెటా సాధారణ ఎన్నికల సమీపిస్తున్న వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చింది. పొలిటికల్ కంటెంట్ ను ఇంస్టాగ్రామ్ థ్రెడ్స్ ఫ్లాట్ ఫామ్ లలో రెకమెండ్ చేయమని ప్రకటించింది. అంతేకాకుండా ఫేస్ బుక్ లో కూడా అవాంఛిత పొలిటికల్ కంటెంట్ కి త్వరలో పులిస్టాప్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో తప్పుడు సమాచారం, డీప్ ఫేక్ ల వ్యాప్తిని అరికట్టడానికి ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా కృషి చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ సాయంతో రూపొందించిన చిత్రాలను గుర్తించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 

తాజాగా ఇంస్టాగ్రామ్, థ్రెడ్స్ ప్లాట్ ఫామ్ లో పొలిటికల్ కంటెంట్ రికమెండ్ చేయమని సంచలన ప్రకటన చేసింది. అయితే పొలిటికల్ కంటెంట్ ను ఇష్టపడే వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని మెటా తెలిపింది. అలాంటి కంటెంట్ ను పోస్ట్ చేసే అకౌంట్లను అనుసరించాలనుకుంటే తాము ఏమాత్రం అడ్డుకోమని స్పష్టం చేసింది. యాప్లలో పొలిటికల్ కంటెంట్ సిఫార్సులను చూడాలా వద్దా అన్నది పూర్తిగా యూజర్ల ఇష్టం. ఈ మేరకు ఎంపిక చేసుకోవడానికి అనుమతి సెట్టింగ్లను మెటా త్వరలో తీసుకురాబోతుంది. ఇదే విధమైన నియంత్రణ రాబోయే రోజుల్లో ఫేస్ బుక్ లో కూడా అమలుకు  ఇంస్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సోరి థ్రెడ్స్ పోస్టులో వెల్లడించారు. ప్రతి ఒక్కరికి ఇంస్టాగ్రామ్ థ్రెడ్స్ గొప్ప అనుభూతి కావాలని తాము కోరుకుంటున్నామని, అందుకే ఫాలో కాని ఖాతాల నుంచి పొలిటికల్ కంటెంట్ ను ముందస్తుగా ప్రమోట్ చేయమని స్పష్టం చేశారు. 

ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనేది రాజకీయ నాయకులు కు బలమైన ప్లాట్ఫామ్ గా తయారైంది. తమ భావాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మెయిన్ మీడియా కంటే సోషల్ మీడియానే బాగా ఉపయోగిస్తున్నారు..అయితే మెటా తాజా నిర్ణయంతో ఇకపై పొలిటికల్ కంటెంట్ అందరికీ చేరదు. పొలిటికల్ ఎకౌంట్లు, పేజీలు ఫాలో అవుతున్న వారికి మాత్రమే పొలిటికల్ కంటెంట్ చేరుతుంది. ప్రస్తుతం రాజకీయ నాయకులు సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు. తమ భావాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సోషల్ మీడియాను ముఖ్య ప్లాట్ఫారం గా ఎంచుకుంటున్నారు..అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. గతంలో ఇలాంటి పొలిటికల్ కంటెంట్ సోషల్ మీడియాలో లేదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం ఎక్కువ అవ్వడంతో పొలిటికల్ కంటెంట్ ను సోషల్ మీడియా ప్రజలకు చేరువేసింది. అవాంచిత పొలిటికల్ కంటెంట్ ఎక్కువ అవ్వడంతో ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ వంటి సోషల్ మీడియా వేదికలో తప్పుడు సమాచారం, డీప్ ఫేక్ ల వ్యాప్తిని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?