UPI Apps : జనాల జేబులకు చిల్లు పెడుతున్న యూపీఐ యాప్స్.. బయటపడ్డ షాకింగ్ విషయాలు..!
స్మార్ట్ ఫోన్ ను తీశామా. స్కాన్ చేసామా. పేమెంట్ చేసామా. అంతే సంగతి. ఎటువంటి చిల్లర సమస్య లేదు. దొంగ నోట్ల ప్రసక్తి అస్సలు లేదు. అయ్యో ఇంటి దగ్గరే పర్సు మర్చిపోయామే, డబ్బులు కూడా తేలేదు అనే ఇబ్బంది కూడా లేదు. యూపీఐ చెల్లింపుల వలన కొనుగోలు చాలా సౌకర్యవంతంగా అయ్యాయి అని చెప్పవచ్చు.
అయితే ఈ నివేదికలో యూపీఐ మరియు ఇతర డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫామ్ నగదు బదిలీ ప్రక్రియను మునుపటి కంటే చాలా సులభం చేసింది అని ఎంతో మంది ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు అంట. ఇది ఒక వైపు మాత్రమే అని మరోవైపు ఈ యూపీఐ యాప్స్ వలన డబ్బు ఖర్చు చేసే నియమంలో జనాలు కంట్రోల్ ఉండటం లేరు అనే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గతంలో అయితే బయటకు వెళ్తే ఖర్చులకు సరిపడా డబ్బులు మాత్రమే పట్టుకొని వెళ్లేవారు. ఎంత నగదు తీసుకెళ్లామో అంత మేర లేదంటే ఇంకా తగ్గించి ఖర్చు చేసుకొని వచ్చేవాళ్లు. కానీ యూపీఐ పేమెంట్స్ పెరగటంతో ఈ కంట్రోలింగ్ విధానం అనేది దెబ్బతిన్నది. మనసుకు నచ్చినవన్నీ కొనుగోలు చేసి స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్న దాంతో ఖర్చుల మీద కూడా అదుపు అనేది లేకుండా పోతుంది.
దీని ఫలితంగా యూపీఐ చెల్లింపుల వలన ప్రజల అవసర ఖర్చులు కంటే అనవసర ఖర్చులు ఎక్కువ చేస్తున్నట్లుగా నివేదిక తెలిపింది.. ఈ తాజా అధ్యయన ప్రకారం చూసుకుంటే. యూపీఐ మరియు ఇతర డిజిటల్ చెల్లింపు పద్ధతులను వాడటం వలన భారత దేశంలో 75 శాతం మంది ప్రజలు ఎక్కువ ఖర్చు చేశారు అని తెలిపింది.
సర్వే ప్రకారం దాదాపుగా 71 శాతం మంది వ్యక్తులు రోజువారి యూపీఐ యాప్స్ వలన లావాదేవీలు చేస్తున్నట్లుగా తెలిపింది. అలాగే యూపీఐ వల్ల చెల్లింపులు సులభంగా మారాయి అని 91.5% మంది ప్రజలు తెలిపారు. ఇదే తరుణంలో వ్యక్తులు యూపీఐ ద్వారా సగటు రోజుకు రూ.200 ఖర్చు చేస్తున్నట్లుగా తెలిపింది.
ఏప్రిల్ మాసంలో యూపీఐ లావాదేవీల సంఖ్య దేశంలో ఒకటి 1,330 కోట్లకు చేరింది. ఏడాది ప్రతిపదికన యూపీఐ లావాదేవీల సంఖ్య 50 శాతం వరకు పెరిగింది. యూపీఐ యాప్స్ వలన ప్రయోజనాల సంగతి పక్కన పెడితే జనాల చేత విపరీతంగా ఖర్చు చేయిస్తు జేబుకు చిల్లులు కూడా పెడుతుంది అని నివేదిక తెలిపింది..