Whats App Update : వాట్సాప్ కీలక అప్ డేట్.. ఇలా చేస్తే అకౌంట్ బ్లాక్..

Whats App Update : వాట్సాప్ కీలక అప్ డేట్.. ఇలా చేస్తే అకౌంట్ బ్లాక్..

Whats App Update :  ఈ ప్రపంచంలోనే చాలామంది వాడే మెసేజింగ్ యాప్ వాట్సప్. దానికి బిలియన్ల యూజర్లు ఉన్నారు. ఇన్ని రోజులుగా మంచి మంచి అప్ డేట్స్ ఇచ్చి కొత్త ఫీచర్ యాడ్ చేసిన వాట్సాప్ ఒక్కసారిగా తన యూజర్ల కు ఒక షాక్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం వాట్సప్ వలన చాలా మోసాలు జరుగుతున్నాయి.

అంతేకాక తప్పుడు సమాచారాలు షేర్ అవుతున్నాయి అని మోటా సంస్థ గుర్తించింది. భారత్ లో వచ్చినటువంటి కొత్త ఐటి చట్టం కూడా వాట్సప్ యాజమాన్యానికి చాలా నిబంధనలు పెట్టింది. కొత్తగా ఈ విషయంలో వాట్సాప్ ఢిల్లీ హైకోర్టుకు తన వివరణ కూడా ఇచ్చింది. కఠినమైనటువంటి రూల్స్ పెడితే మాత్రం భారత్ నుండి వెళ్లిపోతాము అని వాట్సప్ కొర్ట్ లో కూడా చెప్పింది.

కానీ వాట్సాప్ మాత్రం అలా చేయదు. ఎందుకు అంటే ఇండియాలో ఆ యాప్ కు చాలా మంది యూజర్లు ఉన్నారు. కావున పైకి అలా చెప్పినంత మాత్రాన వినియోగదారులపై ఒత్తిడి లేకుండా వాట్సాప్ రూల్స్ ఒక్కొక్కటిగా పాటిస్తూ ఉంటుంది. యూజర్లపై నిఘ పెట్టటం మొదలుపెట్టింది.

033 -2

ఈ మేరకు వాట్సప్ లో ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ చేసిన, అశ్లీల చిత్రాలు పంపించిన,స్పామ్ మెసేజ్ లు, ఆటోమేటెడ్ బల్స్ మెసేజ్ లు పంపిన కూడా తాత్కాలికంగా వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేస్తాము అని వాట్సప్ హెచ్చరించింది. ఈ ఫిచర్ త్వరలోనే వాట్సప్ అండ్రాయిడ్ బీటా వర్షన్ యూజర్లకు అమలు చేస్తామని దానిపై టెస్టింగ్ జరుగుతుంది అని సంస్థ వారు చెప్పారు..

ఇప్పటికే వాట్సాప్ అకౌంట్ యూజర్లు నిజానిజాల నిర్ధారణ చేసుకోకుండా స్పామ్ పోస్టులను పంచుకుంటే వారి ఖాతాలకు బ్లాక్ చేయాలని వాట్సప్ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే వాట్సాప్ భారతదేశంలో 23 లక్షల ఖాతాలను బ్లాక్ చేసింది.

ఇక వాట్సప్ వినియోగదారులు తమ వాట్సాప్ ఖాతాలు బ్లాక్ కాకుండా ఉండాలి అంటే వాట్సప్ పెట్టిన నిబంధనలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.  వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ ను పంపించేటప్పుడు ఆ వాస్తవాలను ప్రచారం చెయ్యొద్దు అని వాట్సప్ తెలిపింది.

033 -4

ఏదైనా మెసేజ్ లేక ఇమేజ్ వస్తే అందులో నిజా నిజాలు నిర్ధారణ చేసుకోకుండా వేరొకరికి ఫార్వర్డ్ చేయడం డేంజర్ అని చెప్పింది. తప్పుడు సందేశాలు, చట్ట విరుద్ధమైన చర్యలు, వ్యక్తులు,సంస్థల పరువుకు భంగం కలిగించే మెసేజ్ లను వాట్సప్ వేదికగా పంపించిన వాట్సప్ అకౌంట్ బ్లాక్ అవుతుంది అని చెప్పారు.

ఇక ఆటోమేటెడ్ బల్క్ మెసేజ్ లను పంపించకుండా చూసుకోవాలి అని చెప్పారు. ఒకవేళ పంపిస్తే వాట్సప్ మిమ్మల్ని స్పామ్ స్టర్ గా గుర్తిస్తుంది.. ఈ వాట్సాప్ లో ఇప్లిమెంటేష న్ చేస్తున్న రూల్స్ పై కసరత్తు జరుగుతుంది. ఈ వాట్సాప్  ఫిచర్ అప్ డేట్ చేస్తున్నారు.

రాబోతున్న కొన్ని వారాలలో వాట్సాప్ దాని రిస్ట్రక్షన్స్ అమలు చేస్తుంది. రూల్స్ కి విరుద్ధంగా ఏం చేసినా కూడా మీ అకౌంట్ ఆటోమేటిక్ గా కొన్ని రోజులు బ్లాక్ అవుతుంది. అప్పుడు మీరు చాట్ చేయలేరు ఇంకా వాట్సాప్ యూస్ కూడా చేయలేరు.

033 -3

అంతే ఆన్ బ్లాక్ చేసుకోవాలి అంటే పెనాల్టీ కూడా కట్టాల్సి ఉంటుంది. ఆ పెనాల్టీ మీరు చేసిన రూల్స్ వైలేషన్ బట్టి ఉంటుంది. ఈ  అప్ డేట్ వచ్చాక. కొత్త వ్యక్తులతో చాట్ చేసేటప్పుడు మీకు ఇది వార్నింగ్ ఇస్తుంది. వాట్సప్ వినియోగదారులు బ్రాడ్ కాస్ట్ మెసేజ్ పంపించటం మంచిది కాదు అని చెప్పారు.

మనం పంపించే మెసేజ్ ల విషయంలో అవతల యూజర్ రిపోర్ట్ ఇస్తే కచ్చితంగా మన ఖాతాపై వేటుపడుతుందని గుర్తించుకోవాలి అని సూచిస్తున్నారు. ఏది ఏమైనా వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘించకుండా వాట్సాప్ ను వినియోగిస్తే మీ అకౌంట్ భద్రంగా ఉంటుంది లేకుంటే అకౌంట్ బ్లాక్ అవుతుందని హెచ్చరిస్తున్నారు..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?