WhatsApp new feature : వాట్సాప్ కీలక అప్ డేట్.. యూజర్ల ప్రైవసీకి కొత్త ఫీచర్..
అయితే ప్రస్తుతం అదే ఫీచర్ ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తుంది. వాట్సప్ అప్ డేట్ లకు సంబంధించిన బీటా ఎన్ఫో రిపోర్ట్ ప్రకారం చూసినట్లయితే. మోట యాజమాన్యంలోని యాప్ తొందర లో ఇతర యూజర్ల ప్రొఫైల్ ఫోటోల స్క్రీన్ షాట్ ల ను తీయకుండా ఉండటానికి ఐఓఎస్ యూజర్లను నిషేధిస్తుంది..
యూజర్ ప్రైవసీ కోసం ప్రొఫైల్ ఫోటోల స్క్రీన్ షాట్ లను తీసేందుకు నిలిపివేసినట్లుగా నోటిఫికేషన్ వస్తుంది.. ఈ ఫీచర్ ప్రైవసీ దుర్వినియోగాన్ని పూర్తిగా తీసివేయలేదు. కానీ ప్రొఫైల్ ఫోటోలను అనధికారికంగా ఇతరులకు షేర్ చేయకుండా ఉండేందుకు నివారించగలదు.
ప్రస్తుతం వాట్సాప్ కూడా ఐఓఎస్ యూజర్ల కోసం థీమ్ ను గ్రేట్ ఇంటర్ పేస్ గా మార్చింది. భారత్ లో ఐఓఎస్ యూజర్లు గత నెలలో వాట్సాప్ లోని కొత్త అప్ డేట్ ను అందుకున్నారు. దీనిలో ఇంటర్ పేస్ సాధారణ బ్లూ కలర్ కు బదులుగా గ్రీన్ బ్యాక్ గ్రౌండ్ కలిగి ఉన్నది.
ఈ ఆండ్రాయిడ్ ఫోన్ లలో వాట్సప్ ఎప్పుడు గ్రీన్ ఇంటర్ పేస్ ను కలిగి ఉంటుంది. అదే ఐ ఫోన్ లలో బ్లూ కలర్ గా ఉంటుంది. స్టేటస్ బార్ నుండి చాట్ లిస్ట్ విండో వరకు ప్రతి దానిని కూడా డిజైన్ మార్పు చేశారు.
ఈ కొత్త మార్పు ఈ ఏడాది ప్రారంభంలో యూజర్లకు అందుబాటులోకి రానుంది. అయితే ఇటీవల ఎక్కువ మంది యూజర్లకు అప్ డేట్ అయ్యింది. ఐకాన్ ల తో పాటు యాప్ లో షేర్ చేసినటువంటి లింకులు కూడా సాధారణ బ్లూ కలర్ బదులుగా గ్రీన్ కలర్ ను కలిగి ఉన్నాయి..