Wine Shops Close : మద్యం ప్రియులకు అలర్ట్.. ఆరోజు వైన్ షాప్స్ బంద్.. ముందురోజే కొని పెట్టుకోండి.. లేకపోతే మందు దొరకదు
మద్యం దుకాణాలే లేకపోతే.. ప్రభుత్వానికి ఆదాయం చాలా వరకు తగ్గుతుంది. మద్యం తాగే వాళ్లు కూడా రోజురోజుకూ పెరుగుతున్నారు. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానా మాత్రం నిండుతోంది. అందుకే.. ఒక్క రోజు మద్యం షాపులు మూసేసినా ఆ రోజు ప్రభుత్వానికి కోట్లలో నష్టం వస్తుంది.
హోలీ పండుగ ఈ నెల 25న దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈనేపథ్యంలో ఈనెల 25న ఉదయం 6 గంటల నుంచి 26న అంటే మంగళవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసేసి ఉంటాయి.. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది.

Wine Shops Close : మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్స్ క్లోజ్
హోలీ సందర్భంగా సోమవారం నాడు మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. దీనికి సంబంధించిన ఆదేశాలను ప్రభుత్వం పోలీస్ శాఖ, అబ్కారీ శాఖలను జారీ చేసింది. అయితే.. తెలంగాణ వ్యాప్తంగా కాకుండా హైదారాబాద్ లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మాత్రమే మద్యం షాపులను క్లోజ్ చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాత్రమే మద్యం షాపులు క్లోజ్ కానున్నాయి.
మద్యం షాపులతో పాటు కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు క్లోజ్ కానున్నాయి. అయితే.. స్టార్ హోటల్లు, రిజిస్టర్డ్ క్లబ్స్ మాత్రం తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. మరోవైపు హోలీ అంటేనే రంగుల పండుగ. చాలామంది జనాలు రోడ్ల మీదికి వచ్చి రంగులు జల్లుతూ ట్రాఫిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటారు. ఎక్కువగా యువత ఇలాంటి పనులు చేస్తుంటారు.
అందుకే.. హోలీ నాడు ఎవ్వరూ రోడ్ల మీదికి వచ్చి న్యూసెన్స్ చేయొద్దని, బైక్ లపై తిరుగుతూ అరుస్తూ హడావుడి చేయొద్దని, వాహనాల్లో వెళ్లే వాళ్లను డిస్టర్బ్ చేయొద్దని.. రోడ్ల మీద వాహనాల్లో వెళ్తూ న్యూసెన్స్ చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. హోలీ పండుగను ఆనందోత్సాహాల మధ్య ఇంట్లోనే జరుపుకోవాలని.. రోడ్ల మీదికి వచ్చి ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తించకూడదని.. అలా పబ్లిక్ ప్లేస్ లలో హోలీ పేరుతో హడావుడి చేస్తే చట్ట విరుద్ధం అని.. రోడ్ల మీద హోలీ వేడుకలు చేసుకోవద్దని సూచించారు.
ఒకవేళ ప్రజలు వినకుండా హైదరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో రోడ్ల మీద న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తే.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరించారు.