Poha packing Business : 25 వేల పెట్టుబడితో లక్షల్లో ఆదాయం.. కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీ..

Poha packing Business : 25 వేల పెట్టుబడితో లక్షల్లో ఆదాయం.. కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీ..

Poha packing Business : గత కొంతకాలం నుండి పౌష్టికాహారం పై ప్రజలలో మంచి అవగాహన వచ్చింది. ఈ క్రమంలోనే పోహాను పౌష్టికాహారంగా పరిగణిస్తున్నారు. దీంతో ప్రస్తుత కాలంలో చాలామంది పోహాను అల్పాహారంగా కూడా తీసుకుంటున్నారు. ఈ పోహా అనేది చాలా సులువుగా జీర్ణం అయ్యే ఆహారం. అంతేకాదు దీని తయారు చేయడం కూడా చాలా సులభం అని చెప్పాలి.

అంతేకాక ప్రస్తుతం మార్కెట్ లో పోహ డిమాండ్ కూడా విపరీతంగా పెరుగుతుండడంతో దీనిని మీరు బిజినెస్ గా మలుచుకొని వ్యాపారం మొదలు పెడితే అధిక మొత్తంలో లాభాలను అర్జించవచ్చు. మీరే సొంతంగా పోహా తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. 

అయితే తాజాగా గ్రామ పరిశ్రమల కమిషన్ పోహా మ్యాన్ ఫ్యాక్చరింగ్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని కూడా తెలపడం జరిగింది. పరిశ్రమల కమిషన్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం పోహ మ్యాన్ ఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాజెక్టు ఖర్చు దాదాపు 2.43 లక్షలు అవుతుందని తెలుస్తోంది.

74 -2

అయితే ఇక్కడ పోహా మ్యాన్ ఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించడానికి ప్రభుత్వం కూడా 90% రుణాలు అందిస్తుంది. అంటే మీ దగ్గర 25 వేల రూపాయలు ఉంటే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు అన్నమాట. కావున అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే ఈ పోహా తయారీ యూనిట్ ను మీరు ప్రారంభించవచ్చు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంత ఖర్చు అవుతుంది...

కెవీఐపీ అందించిన నివేదిక ప్రకారం పోహ మ్యాన్ ఫ్యాక్చరింగ్ యూనిట్ ను ప్రారంభించడానికి 2.43 లక్షల పెట్టుబడి అవసరమవుతుంది. అలాగే 500 చదరపు అడుగుల స్థలంలో దీనికి సంబంధించిన యూనిట్ ను ఇన్స్టాల్ చేయాలి. దీనికోసం మీరు 1 లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అదేవిధంగా పోహా తయారీకి ఉపయోగించే యంత్రం ,జల్లెడలు ,కొలిమి, ప్యాకింగ్ మిషన్, డ్రమ్ వంటి వస్తువుల కోసం మరో లక్ష ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటివరకు 2 లక్షలు ఖర్చు కాగా మరో 43 వేలు వర్కింగ్ క్యాపిటల్ గా ఖర్చవుతుందని చెప్పాలి.

సంపాదన...

ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ముడి సరుకు మీరే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దాదాపు దానికి 6 లక్షల వరకు ఖర్చు ఉంటుంది. దీనితో పాటు మరో 5. వేలు అదనపు ఖర్చు కూడా ఉంటుంది. ఇక ఈ మొత్తం ఖర్చుతో మీరు సుమారు 1000 క్వింటాల  పోహాని ఉత్పత్తి చేయవచ్చు. ఈ విధంగా 1000 క్వింటాలు ఉత్పత్తికి దాదాపు 8.6 లక్షలు పెట్టుబడి కాగా , ఈ మొత్తాన్ని మీరు 10లక్షలకు అమ్మవచ్చు. అంటే 1000 క్వింటాల పోహా పై దాదాపు 1.40 లక్షలు సంపాదించవచ్చన్నమాట.

74 -3

కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీ...

అయితే మీరు కూడా ఈ పోహ తయారీ మ్యాన్ ఫ్యాక్చరింగ్ యూనిట్ ను ప్రారంభించాలి అనుకుంటే మీకు కేంద్ర ప్రభుత్వం రాయితీ కూడా అందిస్తుంది. ఇక ఈ రాయితీని ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీరు 90% లోన్ పొందవచ్చు. ఇక ఈ లోన్ ద్వారా మీరు వ్యాపారాన్ని ప్రారంభించి తర్వాత దీనిని తీర్చుకోవచ్చు.

కావున అతి తక్కువ పెట్టుబడితో మీరు వ్యాపారాన్ని ప్రారంభించి అధిక మొత్తంలో లాభాలను అర్జించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మంచి బిజినెస్ చేయాలి అనుకునేవారు  ఈ వ్యాపారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే మొదలు పెట్టవచ్చు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?