Women Food making Business : మహిళలకు మంచి బిజినెస్ ఐడియా.. రోజూ రెండు గంటలు పనిచేస్తే లక్షల్లో ఆదాయం..
ఈ నేపథ్యంలోనే చాలామంది తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు ఉండే బిజినెస్ కోసం అలాగే ఎలాంటి రిస్క్ లేకుండా మొదలుపెట్టగలిగే వ్యాపారాల కోసం చూస్తున్నారు. మరి అలాంటి వారి కోసమే ఇప్పుడు ఒక మంచి బిజినెస్ ఐడియాను తీసుకొచ్చాం. ఇక ఈ బిజినెస్ ముఖ్యంగా మహిళల కోసం అని చెప్పవచ్చు.
ఫుడ్ బిజినెస్...
అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఉదయం బయట దొరికే టిఫిన్ ఎక్కువగా తింటుంటారు. ఇక ఇదే అవకాశాన్ని మనం బిజినెస్ గా మలుచుకుంటే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అలాగే మీరు ఈ ఫుడ్ బిజినెస్ ను మీ ఇంట్లో ఉండి కూడా ప్రారంభించవచ్చు. దీనికోసం ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు.
ప్రతిరోజు టిఫిన్ చేసేందుకు కావలసిన ముడి సరుకు ఖర్చు పెడితే సరిపోతుంది. అంతేకాక మంచి నాణ్యతతో మంచి టిఫిన్ అందిస్తే మీ వ్యాపారం కూడా అంచలంచెలుగా పెరుగుతూ పోతుంది. ఈ విధంగా మీరు పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు.
పెట్టుబడి ఎంత..
ఈ వ్యాపారానికి ప్రత్యేకంగా మీరు స్థలం కూడా కేటాయించాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో కూడా దీన్ని ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు 8 నుంచి 10 వేల ఖర్చు అవుతుంది. ఈ ఫుడ్ బిజినెస్ వ్యాపారానికి పబ్లిసిటీ అనేది చాలా ముఖ్యం. తద్వారా మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడంతో పాటు వ్యాపారాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు.
ఇక కస్టమర్లు మీరు వండిన ఆహారాలను ఇష్టపడినట్లైతే క్రమంగా కస్టమర్ల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. తద్వారా రానున్న రోజుల్లో మీరు ఈ వ్యాపారం ద్వారా నెలకు లక్ష రూపాయలు కూడా సంపాదించవచ్చు. అయితే మీరు ఈ వ్యాపారాన్ని మీ ఇంట్లో ప్రారంభించినట్లయితే... మొదట మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారి ద్వారా మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోండి.
ఆ తర్వాత మీ వ్యాపారం ఫేస్ బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా అందరికీ తెలిసేలా చేస్తే మరింత గిరాకీ పెరిగే అవకాశం ఉంటుంది. అంతెందుకు ఇటీవల రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ నడిపినటువంటి కుమారి ఆంటీ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే కదా.
ఆమె కూడా ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టిన సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ఎంత సక్సెస్ అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.