XTV app : యూట్యూబ్ కి పోటీగా ఎక్స్ టీవీ యాప్... ఎలాన్ మాస్క్ సంచలన నిర్ణయం...
ఈ తరుణంలో ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఎక్స్ దీనిపై దృష్టి పెట్టారు. తొందరలోనే యూట్యూబ్ ప్రత్యమ్యాయంగా మరొక కొత్త ప్లాట్ ఫామ్ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఎక్స్ ఎలాన్ మాస్క్ ఎక్స్ వేదికగా సూచన ప్రాయంగా తెలిపారు. అతి పెద్ద స్క్రీన్ పై చూడగలిగే విధంగా ఎక్స్ టీవీ యాప్ ను తీసుకురావడానికి ఒక ప్రణాళికను తయారు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కానీ ప్రస్తుతం ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మరింత విస్తరణ వైపుకు అడుగు వేయబోతుంది. జాబ్ పోస్టింగ్ లను అనుమతించటం దగ్గర నుండి భవిష్యత్తులో ప్లాట్ ఫామ్ చెల్లింపులు చేసేందుకు వినియోగదారులను అనుమతించేలా ఒక కొత్త ఫిచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేయనుంది.
అంతేకాక వీడియోల స్ట్రిమ్మింగ్ స్పేస్ లో యూట్యూబ్ తో పోటీపడేలా తొందరలో ఈ టీవీ యాప్ మన కు అందుబాటులోకి వస్తుంది అని ఎలాన్ మాస్క్ తెలిపారు. తాను ట్విట్టర్ ని కొనుగోలు చేసినప్పటి నుండి ఎలాన్ మాస్క్ రకరకాల మార్పులు చేస్తూ వచ్చాడు. ఈ ప్లాట్ ఫామ్ కి ఎక్స్ గా నామకరణం చేయటం, బ్లూటిక్ చార్జ్ చేయడం తో పాటుగా ఎన్నో మార్పులు, చేర్పులు చేశాడు.
ఈ తరుణంలోనే కొత్తగా ఎక్స్ టీవీ యాప్ ను రంగంలో దించేందుకు సిద్ధమయ్యాడు. యూజర్లు హైక్వాలిటీ వీడియోలు అప్లోడ్ చేసేందుకు వీలుగా దీనిని అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లుగా ఎక్స్ సీఈవో లిండా యాకరినో ప్రకటన చేశాడు. చిన్నతేర నుండి పెద్ద తేర వరకు కూడా ఈ చిన్న ఎక్స్ ప్లాట్ ఫామ్ అన్నింటిని కూడా మారుస్తుంది.
ఎక్స్ టీవీ యాప్ తో ఆకర్షనీయమైన కంటెంట్ ను మీ స్మార్ట్ టీవీలో కి తీసుకు వస్తున్నారు. పెద్ద స్క్రీన్ పై అత్యంత న్యాయమైన కంటెంట్ ఇందులో లీనమయ్యే అనుభవాన్ని కూడా ఇది ఇస్తుంది అని లిండా తెలిపారు. ప్రస్తుతం ఇది రూపుదిద్దుకుంటుంది అని తెలిపారు..
ఈ ఎక్స్ టీవీ యాప్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ తాము ఇస్తూ ఉంటాం అని దీనిని మరింత మెరుగ్గా తయారు చేయటానికి గాను మీ ఐడియాలను సైతం పంచుకోవాలి అని లిండా ఎక్స్ వేడుకగా యూజర్లను కోరాడు. తన కమ్యూనిటీ కోసం ఎక్స్ ప్లాట్ ఫామ్ ను స్థాపించాను అని తెలిపారు. కాగా ఈ ఎక్స్ టీవీ యాప్ దాదాపు యూట్యూబ్ ఇంటర్ ఫేస్ ను కలిగి ఉంటుంది అని తెలుస్తుంది.
ట్రెండింగ్ వీడియో అల్గారీథమ్, క్రాస్ డివైస్ అనుభవం, A1 ఆధారిత అంశాలు, మెరుగైన సెర్చింగ్ ఆప్షన్,సులువైన కాస్టింగ్ విధానం విస్తృత లభ్యత లాంటి అంశాలను యూజర్లు ఈ టీవీ యాప్ ద్వారా ఆశించవచ్చు. ఎక్స్ వేదికగా ఎలాన్ మాస్క్ వినియోగదారులతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మాస్క్ స్మార్ట్ టీవీ యాప్ గురించి కూడా మాట్లాడాడు.
అయితే ఫోన్లో పొడవైన వీడియోలను చూడటం నిజంగా వీలుకాదు కాబట్టి స్మార్ట్ టీవీల కోసం ట్విట్టర్ వీడియో యాప్ ఎలా అవసరం అని వినియోగదారుడు అడిగినప్పుడు మాస్క్ తమ ట్వీట్ కు ప్రతిస్పందిస్తూ 'కమింగ్ సూన్' అని చెప్పాడు.