Harihari Veeramallu: "హరిహరి వీరమల్లు" సినిమా రిలీజ్ అప్‌డేట్.. పవన్ అభిమానుల్లో ఉత్సాహం..
Harihari Veeramallu : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pavan Kalyan) హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ హిస్తారికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) మూవీ రిలీజ్‌పై క్లారిటీ వచ్చింది. తన కెరీర్‌లో తొలిసారి పవన్ కల్యాణ్ చారిత్రక పాత్రలో నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఒకప్పడు మొఘలాయి రాజులను ఎదిరించిన ’హరి హర వీరమల్లు’ ప్రతాపం తెరపై ఎలా ఉండబోతుందో అని ఆడియెన్స్ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్‌తో ‘ఖుషి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన సీనియర్ నిర్మాత ఎం.ఎం.రత్నం ఈ సినిమాను సమర్పిస్తున్నారు. దీంతో సినిమా ప్రారంభించినప్పుడే మంచి హైప్ వస్తోంది. కరోనా కంటే ముందుగానే ఈ సినిమా ప్రారంభమైనా ఇప్పటి వరకు అప్‌డేట్ లేకపోవడంతో కొంతవరకు అభిమానులకు నిరాశే ఎదురైందని చెప్పవచ్చు. ఇంచుమించుగా నాలుగేళ్లు అయిపోతున్నా ఇంకా పూర్తికాకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు.
మరోవైపు, ‘హరిహర వీరమల్లు’ సినిమాపై పవన్ కళ్యాణ్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని, అందుకే, దాన్ని పక్కనపెట్టి మిగిలిన సినిమాలు పూర్తిచేస్తున్నారనే విమర్శలు సైతం వచ్చాయి. ఈ క్రమంలో తమ సినిమాపై నిర్మాత ఎ.ఎం.రత్నం స్పందించారు. సోమవారం ‘రూల్స్ రంజన్’ సినిమా ప్రెస్ మీట్‌లో పాల్గొన్న ఆయన ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ అప్‌డేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి ఉత్సాహం తెప్పించే వార్త చెప్పారు. ‘హరిహర వీరమల్లు హిస్టారికల్ మూవీ.. ఇది చాలా పెద్ద సినిమా. కళ్యాణ్ పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నారు. ఒకేసారి అన్ని డేట్లు ఇచ్చినా మేం సినిమా చేయలేకపోతున్నాం. ఎందుకంటే చాలా సెట్లు వేయాల్సి వస్తోంది, మామూలు సినిమా మాదిరిగా రెగ్యులర్‌గా తీసే అవకాశం లేదు. ఇందులో చాలా గ్రాఫిక్స్ వర్క్‌తో పాటు ఇతర పనులు చాలా ఉన్నందువల్ల కాస్త ఆలస్యమవుతోంది. నేను సినిమాల్లో సంపాదించిన సొమ్మును పాలిటిక్స్‌లో పెడుతున్నా అనే విషయం అందరికీ తెలుసు అనే విషయాన్ని పవన్ కల్యాణ్ చాలా సందర్బాల్లో చెబుతూనే ఉంటారు. అందువల్లే తక్కువ రీమేక్స్, తక్కువ రోజుల్లో పూర్తయ్యే సినిమాలు ఆయన ప్యార్లర్‌గా చేస్తున్నారు.