Rajugari ammai Naidugari abbai : "రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి" ట్రైలర్ రిలీజ్‌

Rajugari ammai Naidugari abbai :

Rajugari ammai Naidugari abbai : మణికొండ రంజిత్ సమర్పణలో వెంకట శివ సాయి ఫిల్మ్స్ పతాకంపై సత్యరాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ముత్యాల రామదాసు, నున్నా కుమారి సంయుక్తంగా నిర్మించిన చిత్రం "రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయిష‌. ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నూతన తారలు రవితేజ నున్నా హీరోగా, నేహ జురెల్ హీరోయిన్ గా ప‌రిచయం కాబోతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పందన వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షక అభిమానుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజా ట్రైలర్ ద్వారా అంచనాలు రెట్టింపు చేసేలా క‌నిపిస్తోంది. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో బుధవారం 'రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి' ట్రైలర్ ఆవిష్కరణ  జరిగింది.

తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ ట్రైలర్ ను విడుద‌ల చేశారు. ఈ సినిమా కామెడీ, సస్పెన్స్ ల కలబోతగా తీసిన‌ట్లు తెలిపారు. ఈ తరం ప్రేక్షకులకు ఈ సినిమా ట్రైలర్  కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఈ చిత్ర బృందం ముందునుంచి చెప్పిన‌ట్లు "రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి" ట్రైలర్ ఎంతో వైవిధ్యంగా అద్భుతంగా ఉంది. లవ్, కామెడీ, సస్పెన్స్ వంటి అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు.  ఆద్యంతం ట్రైల‌ర్‌ ఆసక్తికరంగా కొన‌సాగింది. వినోదాత్మ‌కంగా పల్లెటూరు నేపథ్యంలో సాగే హాస్య సన్నివేశాలతో  ట్రైలర్ ప్రారంభమైంది. హీరో, హీరోయిన్‌ల మధ్య ప్రేమ సన్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉన్నాయి.కథానాయిక హత్యతో సాఫీగా సాగిపోతున్నస్టోరీ ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగిన‌ట్లు ట్రైలర్ లో బాగా చూపించారు.. హిరోయిన్ హ‌త్య‌కు హీరోనే కార‌ణం అన్న‌ట్లు, పోలీసులు అత‌డి కోసం గాలిస్తున్న‌ట్లు ట్రైల‌ర్‌లో ఆస‌క్తిక‌రంగా చూపించారు. రాజు గారి అమ్మాయి ఎలా చనిపోయింది? నాయుడు గారి అబ్బాయే ఆమెను హత్య చేసిన‌ట్లు? అందుకు కార‌ణాలు తెలుసుకోవాల‌నే స‌స్పెన్స్‌ను  ట్రైలర్ లో ఆక‌ట్టుకునేలా ముగించారు. 

ఈ సందర్భంగా దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ గారు మాడ్లాడుతూ.. ఈ సినిమా అందరికీ  బాగా కనెక్ట్ అయ్యేలా టైటిల్ ఉంది. గ్రామీణ వాతావ‌ర‌ణంతో కూడిన కథతో దర్శకుడిగా సత్యరాజ్ మొదటి సినిమా చేశాడు. ఈ సినిమాలో దండిగా కమర్షియల్ అంశాలు ఉన్నాయి. సత్యరాజ్ కి ముందుగానే ఆల్ ది బెస్ట్. ముత్యాల రామదాసు రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నాను. సాలూరి రాజేశ్వరరావు మనవడు రోషన్ మంచి సంగీతం అందించాడు. అందుకే ఆదిత్య సంస్థ పాటలను విడుదల చేసేందుకు ముందుకొచ్చింది. హీరో ర‌వితేజ నున్నా ట్రైల‌ర్‌లో పక్కింటి అబ్బాయిలా కనిపిస్తున్నాడు. హీరోయిన్ నేహ కూడా ఎటువంటి బెరుకు లేకుండా న‌టించింది. ఈ చిత్రం ఘన విజయం సాధించి అందరికీ మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను" అన్నారు. నిర్మాత ముత్యాల రామదాసు  మాట్లాడుతూ.. "రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి" అనే టైటిల్ ప్రేక్ష‌కుల‌ను సినిమావైపు ఆక‌ర్ష‌ణ‌గా ఉంద‌న్నారు. దర్శకుడు సత్యరాజ్ కి మంచి ఫ్యూచ‌ర్ ఉంది.  ఫైనాన్షియల్ ప‌రంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని దర్శకుడు ఈ సినిమాని పూర్తి చేయడం చాలా గొప్ప‌ విషయం. యువత, కుటుంబ స‌మేతంగా ప్రేక్షకులను అలరించడానికి ఈ చిత్రం మార్చి 9వ తేదీన థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?