టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎటువంటి గుర్తింపు ఉందో అందరికీ తెలుసు. అక్కినేని నాగేశ్వరావు తో మొదలైన ఆ ప్రస్థానాన్ని నాగార్జున కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన వారసులు నాగచైతన్య, అఖిల్ నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే నాగార్జునకు వచ్చినంత క్రేజ్ అఖిల్, నాగచైతన్య లకు ఇంకా రాలేదు. అందుకు వారు కూడా ఎంతో కష్టపడుతున్నారు. ఇకపోతే నాగార్జున మొదటిగా దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి నాగచైతన్య జన్మించారు. కొన్ని మనస్పర్ధలు కారణంగా లక్ష్మి, నాగార్జున విడిపోయారు. ఆ తర్వాత సినిమాలు చేసే కెరీర్లో ముందుకెళ్లే క్రమంలో తనతో కలిసి నటించిన నటి అమలను నాగార్జున ప్రేమించారు. ఆ విధంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు అఖిల్ జన్మించారు. పెళ్లి తర్వాత అమల సినిమాలను తగ్గించారు.
ఏదైనా బలమైన పాత్రలు లేదా కీలకమైన పాత్రలు వస్తే నటిస్తున్నారు. ఆ మధ్య శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితంలో ఆమె అమ్మ పాత్రలో నటించి మెప్పించారు. అయితే అమల చైతూ, అఖిల్ లో ఇద్దరిని సమానంగా చూస్తుందని చాలామంది అంటుంటారు. ఇద్దరికీ ప్రేమను సమానంగా పంచుతుందని చెబుతుంటారు. అయితే తాజాగా అక్కినేని అమల నాగచైతన్యపై ఆసక్తికర కామెంట్లు చేశారు. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి వివరించారు. వ్యక్తిగతంగా ఎలా ఉంటారు అన్న విషయాల గురించి మాట్లాడారు. అలాగే అక్కినేని అఖిల్ గురించి కూడా చెప్పుకొచ్చారు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదంతా చెప్పారు. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. అమల మాట్లాడుతూ .. చైతన్యను నేను పెంచలేదు. వాళ్ళ అమ్మనే పెంచారు. చెన్నై నుంచి అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి.
అఖిల్ కు ఓ మంచి బలమైన అన్నయ్య అతడు. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. గొడవలు అస్సలు ఉండవు. చిన్నప్పుడు అయితే చైతూ ఇంటికి ఎప్పుడు వస్తాడా అని అఖిల్ ఎదురు చూస్తూ ఉండేవాడు. చైతూ వస్తే అతడి వెనకాలే తోకలాగా అఖిల్ తిరిగేవాడు. ఇద్దరి మధ్య బాండింగ్ చూస్తే చూడముచ్చటగా అనిపించేది. చైతూ నాటీ కాదు. సైలెంట్ గా ఉంటాడు. తన తండ్రితో ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడుతుంటాడు. అఖిల్ హైపర్ యాక్టివ్ గా ఉంటాడు. ఎన్నో యాక్టివిటీస్ లో పాల్గొంటాడు. ఇప్పుడు వీరిద్దరి సినిమాలు రిలీజ్ అవుతుంటే నా గుండె బాగా కొట్టుకుంటుంది. కానీ జీవితం అనేది గొప్ప టీచర్ లాంటిది. వర్క్ పట్ల ఫ్యాషన్ ఉంటే చాలు విజయాలు, పరాజయాలు వస్తుంటాయి. అపజయముంటే నిరాశ తప్పకుండా ఎదిగేందుకు మనకు అవకాశం కూడా ఇస్తుంది. చైతూ, అఖిల్ వాళ్ళ నాన్న లాగే సినిమా అయిపోగానే దాని రిజల్ట్ నుంచి బయటికి వచ్చేసి రెండో ప్రాజెక్ట్ పై దృష్టి పెడతారు అని అమల చెప్పుకొచ్చారు.