Prabhas and Imanvi: అసలు ఎవరు ఈ ఇమాన్వి.. తొలి సినిమానే ఏకంగా ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో.. ?
ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఫ్యాన్ ఇండియా లెవెల్ స్టార్, తన సినిమా అంటే దాదాపు 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయే ప్రభాస్ పక్కన ఎటువంటి అనుభవం లేని ఈ అమ్మాయిని హీరోయిన్ లా ఎంపిక చేయడంపై అందరూ షాకింగ్ గురయ్యారు. అంతేకాకుండా వీళ్ళందర్నీ షాకింగ్ గురి చేసేలా ఇమాన్యు ఇస్మాయిల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కి ఒక్కరోజులోనే లక్ష మంది ఫాలోవర్లు పెరిగారు.
ఇమాన్ వి తన పేరు ఇప్పుడు ఇండస్ట్రీలోనే తెలియని వారంటూ ఎవరూ లేరు. 1995లో ఢిల్లీలో పుట్టిన ఇమాన్వి ఇస్మాయిల్ తన నటనతో సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ బాగా పాపులర్ అయింది. అయితే తన కుటుంబానికి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేదు. అసలు సినీ ఇండస్ట్రీ అనే ఊసే లేదు. కానీ ఇప్పుడు ఏకంగా తన తొలి సినిమా గా ప్రభాస్ తోనే చేస్తున్నడంతో తను ఆశ్చర్యం లోకి గురై ఉండవచ్చు.

ఈ ఇమాన్వి మంచి డాన్సర్. అలాగే తన నటనకి ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే తనకు ఇవే కాకుండా కూచిపూడి భరతనాట్యం కూడా వచ్చు అని సోషల్ మీడియాలో తెలిపారు. తను డాన్స్ ప్రాక్టీస్ ఏకంగా విదేశాల్లోనే నేర్చుకుందట. అలాగే మన ఇండియాలోని తెలుగు హిందీ తమిళ సాంగ్స్ కు సోషల్ మీడియాలో పాపులర్ సాంగ్స్ కు డాన్సులు వేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది.
ఈమధ్య మహేష్ బాబు కుర్చీ మడత పెట్టి సాంగ్కు, జైలర్ మూవీలోని నువ్వు కావాలయ్యా సాంగ్ కి తనదైన శైలిలో డాన్సులు వేస్తూ లక్షలలో వ్యూస్ ని సంపాదించి మంచి పేరుతో చాలా ట్రెండింగ్ లో నిలిచారు. అయితే ఈ సోషల్ మీడియా లోనే సినిమాలోని ఒరిజినల్ హీరోయిన్స్ కన్నా ఈ ఇమాన్వి ఇస్మాయిల్ బాగా చేసిందంటూ నేటిజెన్ల నుండి ప్రశంసలు అందుకుంది.
మొన్నటిదాకా 5 నుండి 6 లక్షలు ఫాలోవర్స్ ఉండేవారు. కానీ ప్రభాస్ తో మూవీ అనగానే ఫస్ట్ మూవీ లాంచింగ్ సమయం తర్వాత ఒక్కరోజులోనే ఏకంగా లక్షమంది ఫ్యాన్స్ పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ప్రస్తుతం ఆమె ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఏడు లక్షలు దాటింది. రేపు మాపో ఈ సంఖ్య వన్ మిలియన్ కి చేరిపోతుందని ఇండియాలోనే ది బెస్ట్ హీరోయిన్ గా కూడా నిలుస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే ఇమాన్వి ఫాన్స్ కామెంట్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమా గురించి అను రాఘవపూడి కొన్ని హింట్స్ ఇచ్చాడు. ప్రభాస్ ఓ పోరాటయోధుడిలా చూపిస్తామంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా 1940లో జరిగిన హిస్టారికల్ లవ్ స్టోరీగా రూపొందించబోతున్నట్లు హను రాఘవపూడి తెలిపారు. అయితే ఇందులో సీనియర్ యాక్టర్స్ నటిస్తున్నారని తెలిపారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అయినటువంటి మిథున్ చక్రవర్తి అలాగే నటి జయప్రద కూడా నటిస్తున్నారని తెలిపారు.
ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుందని మూవీ లాంచ్ టైంలో చెప్పుకొచ్చారు. అయితే ఫస్ట్ టైం మూవీలో నటించబోతున్న హీరోయిన్ ఎంత మాత్రం తన పాత్రకు న్యాయం చేయగలుగుతుందో ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. ఏకంగా ప్రభాస్ తోనే నటిస్తున్నందువలన ఇమాన్వి అలాగే ఇమాన్వి ఫాన్స్ కు ఆనందాలకి హద్దులు లేవు. మరి ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఇమాన్వి సూట్ అవుతుందా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఈమధ్య సినిమాలనేవి హిట్ అయినా హిట్ కాకపోయినా సినిమాలలోని హీరోయిన్స్ క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉంది. రీసెంట్ గా వచ్చిన మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ కూడా మొదటి సినిమాతోనే ఎంతోమంది ఫ్యాన్స్ ని తన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ హీరోయిన్ కూడా తన మొదటి సినిమాతో ఎంతోమంది నీ ఫ్యాన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.
ఫ్యాన్స్ అందరూ ఈ ఇమాన్వి ఇస్మాయిల్ ని ది లక్కీ గర్ల్ ఇన్ ఇండియన్ అని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఇమాన్వి నటన ఎంతెంత మాత్రంగా ఉంటుందో అలాగే ప్రభాస్ తో ఈ హీరోయిన్ కాంబినేషన్ సూట్ అవుతుందో లేదో సినిమా విడుదల అయ్యేదాకా ఆగాల్సిందే.